David Warner : ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు.. ఆ దేశం తరపున రెండో ప్లేయర్ అతనే

ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఆస్ట్రేలియా తరపున అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ నిలిచాడు.

Australia Batter David Warner : ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఆస్ట్రేలియా తరపున అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ నిలిచాడు. 37ఏళ్ల వార్నర్.. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో పాకిస్థాన్ పై ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ తో బ్యాక్సింగ్ డే టెస్టు (రెండోది)లో ఆస్ట్రేలియా టాస్ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా తొలిరోజు కేవలం 66 ఓవర్లే సాధ్యమయ్యాయి. దీంతో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన డేవిడ్ వార్నర్ 83 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేవాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో 18,500 పరుగులు కూడా పూర్తి చేశారు.

Also Read : Kagiso Rabada : టీమ్ఇండియాతో తొలి టెస్టు.. అరుదైన ఘ‌న‌తను సొంతం చేసుకున్న ర‌బాడ‌

డేవిడ్ వార్నర్ మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే, టీ20) లో ఆస్ట్రేలియా రెండో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లో 18,515 పరుగులు చేసిన వార్నర్.. స్టీవ్ వా (18,496) అంతర్జాతీయ పరుగులను అధిగమించి రెండో స్థానికి చేరాడు. ఆస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నెంబర్ 1 స్థానంలో రికీ పాటింగ్ ఉన్నాడు. రికీ పాటింగ్ 27,368 పరుగులు చేశాడు. ఈ ముగ్గురే ఆస్ట్రేలియా నుంచి 18వేల పరుగులు దాటిన ప్లేయర్స్.

Also Read : AUS vs PAK : బ్యాట్ ప‌ట్టుకుని పావురాల వెంటప‌డిన ల‌బుషేన్‌.. వీడియో చూస్తే న‌వ్వాగ‌దు..!

డేవిడ్ వార్నర్ 111 టెస్టు మ్యాచ్ లలో 44.78 సగటుతో 8,689 పరుగులు చేశాడు. వన్డేల్లో 161 మ్యాచ్ లు ఆడి 45.30 సగటుతో 6,932 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్ లో 99 మ్యాచ్ లు ఆడిన వార్నర్ 32.88 సగటుతో 2,894 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో 371 అంతర్జాతీయ మ్యాచ్ లలో వార్నర్.. 42.56 సగటుతో ఆస్ట్రేలియా తరపున 18,515 పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. డు ఫార్మాట్లలో వార్నర్ కు 49 సెంచరీలు, 93 అర్థ సెంచరీలు ఉన్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు