Kagiso Rabada : టీమ్ఇండియాతో తొలి టెస్టు.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రబాడ
దక్షిణాఫ్రికా పేసర్ కగిసొ రబాడ అరుదైన ఘనత సాధించాడు.

Rabada 500 international wickets
Rabada 500 international wickets : దక్షిణాఫ్రికా పేసర్ కగిసొ రబాడ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఎలైట్ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం సెంచూరియన్ వేదికగా భారత్‌తో ఆరంభమైన మొదటి టెస్టు మ్యాచులో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో ఎక్కాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌ను పెవిలియన్‌కు పంపిన రబాడ 5 వికెట్లతో టీమ్ఇండియా నడ్డి విరిచాడు.
101 వన్డేల్లో 157 వికెట్లు, 56 టీ20ల్లో 58 వికెట్లు తీసిన రబాడ 61 టెస్టుల్లో 285 వికెట్లు సాధించాడు. మొత్తంగా 218 ఇన్నింగ్స్‌ల్లో 500 వికెట్ల ఘనతను అందుకున్నాడు. సఫారి బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్ (182), అలాన్ డొనాల్డ్ (196), మఖాయ ఎంతిని (213) లు రబాడ కన్న తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.
IND vs SA 1st test : టాస్ ఓడిపోయినందుకు ఆనందపడ్డ రోహిత్ శర్మ..! జడేజా ఎందుకు ఆడడం లేదంటే..?
ఓవరాల్‌గా అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన బౌలర్లు..
రిచర్డ్ హ్యాడ్లీ – 168 ఇన్నింగ్స్‌ల్లో
డేల్ స్టెయిన్ – 177
అలాన్ డోనాల్డ్ – 182
గ్లెన్ మెక్‌గ్రాత్ – 196
ఇయాన్ బోథమ్ – 197
మాల్కం మార్షల్ – 198
ట్రెంట్ బౌల్ట్ – 199
మిచెల్ స్టార్క్- 200
వకార్ యూనిస్ – 205
ఇమ్రాన్ ఖాన్ – 210
మఖాయ ఎంతిని – 211
బ్రెట్ లీ – 213
కర్ట్లీ ఆంబ్రోస్ – 217
కగిసో రబడ – 218
దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
షాన్ పొలాక్ – 829 వికెట్లు
డేల్ స్టెయిన్ – 699
మఖాయ ఎంతిని – 662
అలాన్ డోనాల్డ్ – 602
జాక్వెస్ కలిస్ – 577
మోర్నీ మోర్కెల్ – 544
కగిసో రబడ – 500*
Kagiso Rabada has taken 500 international wickets at the age of just 28.
– A legend in the making…!!! ? pic.twitter.com/kR8TaCvnfR
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023