Ravichandran Ashwin : ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ ఫోటో వైరల్.. అశ్విన్ పేరు పక్కన ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే..?
ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లోని ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ravichandran Ashwin
Ashwin : ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచులో గెలిచిన ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. మెల్‌బోర్న్ వేదికగా నేడు (మంగళవారం) రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం కారణంగా మొదటి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు ఆట పూర్తి అయ్యే సరికి ఆస్ట్రేలియా 66 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (44), ట్రావిస్ హెడ్ (9)లు క్రీజులో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లోని ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్ ఆల్‌రౌండర్లకు సంబంధించిన పేర్లు బోర్డు పై రాసి ఉన్నాయి. వీరి గురించి ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మిగిలిన ఆటగాళ్లు వివరిస్తున్నాడు. ఈ బోర్డుపై తొమ్మిది మంది ఆటగాళ్ల పేర్లు రాసి ఉండగా అందులో భారత్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్ల పేర్లు ఉండడం విశేషం.
రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ పేర్లు అందులో ఉన్నాయి. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెటోరీ, సోబర్స్, షకీబ్ అల్ హసన్ పేర్లు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతూ పాక్ ప్లేయర్ల గురించి కాకుండా ఇతర దేశాల ఆటగాళ్ల గురించి ఇప్పుడెందుకు చర్చిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ..? అశ్విన్ పేరు పక్కన క్వశ్చన్ మార్క్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అంటే అశ్విన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో ఇంకా ఆస్ట్రేలియాకు తెలియనట్లు ఉందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Best spinning all rounders list in the Australian dressing room.
– Jadeja, Ashwin and Axar in the list…!!!! pic.twitter.com/76TDz2r50e
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023
AUS vs PAK : బ్యాట్ పట్టుకుని పావురాల వెంటపడిన లబుషేన్.. వీడియో చూస్తే నవ్వాగదు..!
కాగా.. టెస్టుల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్ అల్ హసన్ మూడులో ఉండగా, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఐదో స్థానంలో భారత ఆటగాడు అక్షర్ పటేల్ నిలిచాడు.