IND vs SA 1st test : దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. మైదానాన్ని వీడిన కెప్టెన్ బవుమా.. మ్యాచ్ ఆడేది డౌటే..! ఎందుకంటే..?
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది.

Temba Bavuma walks off after limping on the field due to injury
IND vs SA 1st test : సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తూ ఆ జట్టును కెప్టెన్ టెంబా బావుమా గాయపడ్డాడు. దీంతో అతడు మైదానాన్ని విడిచివెళ్లాడు. ఇక ఈ రోజు అతడు మైదానంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గాయం తీవ్రత గనుక పెద్దదైతే అతడు ఈ మ్యాచ్‌లో ఇక ఆడకపోవచ్చు. అదే జరిగితే ఇది దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ కానుంది.
ఏం జరిగిందంటే..?
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. భారత ఇన్నింగ్స్ 20 ఓవర్‌లో ఫీల్డింగ్ చేస్తూ బవుమా గాయపడ్డాడు. మార్కో జాన్సెస్ ఈ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడాడు. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ బవుమా బంతిని ఛేజ్ చేశాడు. ఈ క్రమంలో అతడి ఎడమకాలి కండరాలు పట్టుకున్నాయి. దీంతో అతడు కుంటు కుంటునే వెళ్లి బంతిని ఆపాడు.
Shikhar Dhawan : కొడుకు కోసం శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్.. చూసి ఏడాదవుతోంది
వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందించిన ప్రయోజనం లేకపోయింది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. బవుమా గాయం తీవ్రతను తెలుసుకునేందుకు స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. కాగా.. బవుమా గ్రౌండ్‌ను వీడడంతో అతడి స్థానంలో డీన్ ఎల్గర్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ నిబంధన ప్రకారం బ్యాటర్‌కు బై రన్నర్‌ను ఉపయోగించుకునే అవకాశం లేదు. ఒకవేళ బవుమా బ్యాటింగ్‌కు వస్తే అతడే పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పేసర్ రబాడ నాలుగు వికెట్లతో విజృంభించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో కేఎల్ రాహుల్ (11), శార్దూల్ ఠాకూర్ (0)లు ఉన్నారు. రోహిత్ శర్మ (5), గిల్ (2)లు విఫలం కాగా.. విరాట్ కోహ్లీ(38), శ్రేయస్ అయ్యర్ (31)లు ఫర్వాలేదనిపించారు.
AUS vs PAK : బ్యాట్ పట్టుకుని పావురాల వెంటపడిన లబుషేన్.. వీడియో చూస్తే నవ్వాగదు..!
Temba Bavuma is Going Off the Field.
Bad News for South African Team & Their Fans…!!! pic.twitter.com/NwhJmUwE4u
— CRIC INSAAN (@CRICINSAAN) December 26, 2023