David Warner : ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును చిన్నారికి ఇచ్చిన వార్న‌ర్‌.. ఎందుకో తెలుసా?

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ సొంత గ‌డ్డ‌పై త‌న చివ‌రి మ్యాచ్‌ను ఆడేశాడు.

David Warner gifts his Player of the Series award to young fan after final home game

David Warner – Player of the Series : ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ సొంత గ‌డ్డ‌పై త‌న చివ‌రి మ్యాచ్‌ను ఆడేశాడు. ఇప్ప‌టికే వ‌న్డేలు, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన వార్న‌ర్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 త‌రువాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌ల‌కనున్న‌ట్లు ఇప్ప‌టికే వెల్ల‌డించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పెర్త్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచే స్వదేశంలో వార్న‌ర్‌కు ఆఖ‌రిది.

వెస్టిండీస్ జ‌ట్టుతో టీ20 సిరీస్ ముగియ‌డంతో ఆస్ట్రేలియా జ‌ట్టు న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ సిరీస్‌లో వార్న‌ర్ ఆడినా కివీస్ గ‌డ్డ‌పైనే ఆడుతాడు. ఆ త‌రువాత ఐపీఎల్ కోసం భార‌త్‌కు రానున్నాడు. ఇక్క‌డి నుంచి నేరుగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం వార్న‌ర్ వెళ్ల‌నున్నాడు.

వెస్టిండీస్‌తో మ్యాచ్ అనంత‌రం మాజీ ఆట‌గాడు, కామెంటేట‌ర్ గిల్‌క్రిస్ట్‌తో వార్న‌ర్ మాట్లాడాడు. ఈ క్ర‌మంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత స్వ‌దేశంలో ఈ పార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడాతావా అని గిల్‌క్రిస్ట్ ప్ర‌శ్నించ‌గా లేదు అని వార్న‌ర్ స‌మాధానం ఇచ్చాడు. ఇప్ప‌టికే ఆడేశాను. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని, మ‌న ద‌గ్గ‌ర అద్భుత‌మైన ఆట‌గాళ్లు ఉన్నార‌న్నాడు. ఈ మ్యాచ్‌లో వార్న‌ర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది 81 ప‌రుగులు చేశాడు.

Ravichandran Ashwin : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. ప‌లు రికార్డుల‌పై క‌న్నేసిన అశ్విన్‌

ఇక సిరీస్ అసాంతం రాణించిన వార్న‌ర్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. కాగా.. ఈ అవార్డును వార్న‌ర్ మైదానంలో ఉన్న చిన్నారుల్లో ఒక‌రికి ఇచ్చేశాడు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 220 ప‌రుగులు చేసింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో ఆండ్రీ ర‌సెల్ (71; 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. అనంత‌రం వార్న‌ర్ రాణించిన‌ప్ప‌టికీ మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 183 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిన‌ప్ప‌టికీ మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆసీస్ 2-1తో గెలుచుకుంది.

BCCI : బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం! ఇషాన్‌ కిష‌న్‌తో పాటు మిగిలిన ఆట‌గాళ్లకు గ‌ట్టి షాక్‌!

ట్రెండింగ్ వార్తలు