ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో టీమ్ఇండియా పై గెలిచిన తరువాత వన్డేలకు, ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడి సుదీర్ఘ ఫార్మాట్‌కు, 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు.
అయితే.. తాజాగా అతడు తన రిటైర్‌మెంట్ పై వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశాడు. అయితే.. అన్ని ఫార్మాట్‌లలో ఆడడట.. కేవలం వన్డేల్లో మాత్రం ఆడతానని, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ మాత్రమే ఆడాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్నర్ ఓ పోస్ట్ పెట్టాడు.
Rahul Dravid : ఇదేం ట్విస్ట్ నాయనా.. రాహుల్ ద్రవిడ్‌తో కేకేఆర్ చర్చలు..! అటు ఇటు.. ఇటు అటు..?
అధ్యాయం ముగిసింది.. ఇంత సుదీర్ఘకాలం అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడడం తనకు దక్కిన ఓ గొప్ప అనుభూతి అని వార్నర్ అన్నాడు. తన కెరీర్ ఎక్కువగా అంతర్జాతీయ స్థాయిలోనే గడిచిపోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇలా జరగడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. అన్ని ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు)లలో 100 కు పైగా మ్యాచ్‌లు ఆడడం తన కెరీర్‌లో హైలెట్ అని అన్నాడు.
తన ప్రయాణంలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. క్రికెట్ అభిమానులను తాను అలరించినట్లుగా భావిస్తున్నట్లుగా చెప్పాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఇతరుల కంటే వేగంగా ఆడి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నట్లుగా వివరించాడు. తాను ఇంకొన్నాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతానని చెప్పాడు. ఒకవేళ సెలక్టర్లు అవకాశం ఇస్తే మాత్రం వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరుపున ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు వార్నర్ తెలిపాడు.
Chris Gayle : 44 ఏళ్ల వయసులోనూ క్రిస్‌గేల్ వీరవిహారం.. దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజయం..
వార్నర్ ఆస్ట్రేలియా తరుపున 112 టెస్టుల్లో, 161 వన్డేల్లో, 110 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 44.6 సగటుతో 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 45.3 సగటుతో 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్థశతకాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 33.4 సగటుతో 3277 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 28 అర్థశతకాలు ఉన్నాయి.