Rahul Dravid : ఇదేం ట్విస్ట్ నాయ‌నా.. రాహుల్ ద్ర‌విడ్‌తో కేకేఆర్ చ‌ర్చ‌లు..! అటు ఇటు.. ఇటు అటు..?

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ పూర్తి కావ‌డంతో హెడ్ కోచ్ గా ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసింది.

Rahul Dravid : ఇదేం ట్విస్ట్ నాయ‌నా.. రాహుల్ ద్ర‌విడ్‌తో కేకేఆర్ చ‌ర్చ‌లు..! అటు ఇటు.. ఇటు అటు..?

KKR Approaches Rahul Dravid for Team Mentor Role in IPL 2025

Rahul Dravid – KKR Mentor : 17 ఏళ్ల త‌రువాత భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను 7 ప‌రుగుల తేడాతో ఓడించి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకుంది. టీమ్ఇండియా విజ‌యం సాధించ‌డంలో రాహుల్ ద్ర‌విడ్ సైతం కీల‌క పాత్ర పోషించాడు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ పూర్తి కావ‌డంతో హెడ్ కోచ్ గా ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసింది.

ఈ క్ర‌మంలో రాహుల్ ద్ర‌విడ్ పై ఐపీఎల్ ఫ్రాంఛైజీలు క‌న్నేశాయి. ఈ ఏడాది చివరిలో మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ వేలం క‌న్నా ముందుగానే ద్ర‌విడ్ ను సొంతం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాయి. కోచ్‌గా లేదంటే మెంటార్‌గా జ‌ట్టులోకి తీసుకోవాల‌ని అనుకుంటున్నాయి. మిగిలిన ప్రాంఛైజీల కంటే కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఓ అడుగు ముందు ఉంది.

Chris Gayle : 44 ఏళ్ల వ‌య‌సులోనూ క్రిస్‌గేల్ వీర‌విహారం.. ద‌క్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజ‌యం..

కేకేఆర్ మెంటార్‌గా రావాల‌ని ద్ర‌విడ్‌ను కోరిన‌ట్లు బెంగాల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ద్ర‌విడ్‌కు బ్లాంక్ చెక్‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్లుగా పేర్కొన్నాయి. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో కేకేఆర్ విజేత‌గా నిలిచింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. అక్క‌డ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టును ఓడించి ఛాంపియ‌న్‌గా నిలిచింది.

కేకేఆర్ విజ‌యంలో మెంటార్‌గా గౌత‌మ్ గంభీర్ కీల‌క పాత్ర పోషించాడు. అయితే.. అత‌డు కొన్ని రోజుల్లో టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అత‌డు కేకేఆర్‌కు వీడ్కోలు చెప్పాడు. దీంతో గంభీర్ స్థానాన్ని ద్ర‌విడ్‌తో భ‌ర్తీ చేయాల‌ని కేకేఆర్ భావిస్తోంద‌ట‌. అయితే.. ఇందుకు ద్ర‌విడ్ అంగీక‌రిస్తాడా..? లేదా..? అన్న‌ది చూడాల్సిందే.

Ishan Kishan : ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన ఇషాన్ కిష‌న్‌.. అలా చెప్ప‌డం న‌చ్చ‌లే.. అందుకే ఇలా.. ఎన్నాళ్లో తెలియ‌దు

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ పేరు దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంద‌ని, అతి త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని అంటున్నారు.