David Warner : దయచేసి నా ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ ఇవ్వండి.. వీడ్కోలు టెస్ట్‌కు ముందు డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి

ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర ఓపెనర్లలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒకడు. దాదాపు దశాబ్దన్నర కాలంగా ఆస్ట్రేలియలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

David Warner

Baggy Green cap : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉద్వేగభరిత విజ్ఞప్తి చేశారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు. దురదృష్టవశాత్తూ నా బ్యాక్‌ప్యాక్‌లో ఉన్న బ్యాగీ గ్రీన్ టెస్టు క్యాప్ ను ఎవరో దొంగిలించారు. సిడ్నీలో దిగిన తరువాత అది గమనించాను. తన క్యాప్ తిరిగి ఇచ్చేయాలని వార్నర్ కోరాడు. మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి వెళ్తున్న క్రమంలో తన లగేజ్ నుంచి బ్యాక్‌ప్యాక్‌ మిస్ అయిందని, అందులోని బ్యాగీ గ్రీన్ క్యాప్ తనకెంతో విలువైందని, తిరిగి ఇస్తే సంతోషిస్తానని చెప్పారు. నా లాస్ట్ మ్యాచ్ లో అది ధరించి బ్యాటింగ్ కు వెళ్లాలనుకుంటున్నానని వార్నర్ అన్నారు. తన బ్యాక్‌పాక్‌ కావాలని ఎవరైనా తీసిఉంటే వారికి నా దగ్గర ఉన్న ఇంకో బ్యాక్‌పాక్‌ ఇస్తానని, కానీ, ఆ క్యాప్ మాత్రం వీలైనంత త్వరగా ఇచ్చేయాలని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు.

Also Read : David Warner : అదృష్టం అంటే వార్న‌ర్‌దే..! అలా వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌గానే.. ఇలా టీ20ల‌కు కెప్టెన్‌గా

ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర ఓపెనర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. దాదాపు దశాబ్దన్నర కాలంగా ఆస్ట్రేలియలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బుధవారం నుంచి సిడ్నీలో పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ తో సుదీర్ఘ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు వార్నర్ గతంలోనే ప్రకటించారు. అయితే, సోమవారం వార్నర్ కీలక ప్రకటన చేశారు. వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైరవుతున్నట్లు తెలిపారు. కేవలం అంతర్జాతీయ టీ20ల్లో మాత్రమే దేశానికి వార్నర్ ప్రాతినిధ్యం వహిస్తారు.

Also Read : Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు బుమ్రాను ఊరిస్తున్న అరుదైన రికార్డులు.. అరంగ్రేట మైదానంలోనే అందుకుంటాడా..?

ఆస్ట్రేలియా జట్టు తరపున 161 వన్డే మ్యాచ్ లు ఆడిన వార్నర్.. 22 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలతో 6932 పరుగులు చేశారు. వార్నర్ 2009జనవరిలో దక్షిణాఫ్రికాపై హోబర్ట్‌లో తన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మార్క్ వా, మైఖేల్ క్లార్క్, స్టీవ్ వా తర్వాత ఆరవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచారు.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు