Rishabh Pant : ఐపీఎల్‌కు సిద్ధం.. వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలెట్టిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

: టీమిండియా యువ ప్లేయర్ రిషబ్ పంత్ ఐపీఎల్ -2024లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

IPL 2024 : టీమిండియా యువ ప్లేయర్ రిషబ్ పంత్ ఐపీఎల్ -2024లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు సందర్భాల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన పంత్.. తాజాగా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశారు. కారు ప్రమాదం తరువాత గత పదిహేను నెలలుగా క్రికెట్ కు పంత్ దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ ప్రారంభించారు. వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంత్ పోస్టు చేశాడు. ఈ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Sachin Tendulkar : విరుష్క జంటకు సచిన్ టెండూల్కర్ అభినందనలు.. ప్రపంచానికి స్వాగతం.. ‘అకాయ్’ లిటిల్ ఛాంప్! అంటూ ట్వీట్!

పంత్ 2022 డిసెంబర్ నెలలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ నుదిటి పై, వీపుపై గాయాలయ్యాయి. అతని కుడి మోకాలుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. పంత్ ఆరోగ్య పరిస్థితి వైద్యులు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంది. రాబోయే ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తరపున ప్రతి మ్యాచ్ లో ఆడేందుకు పంత్ సిద్ధమవుతున్నాడు. అయితే, పంత్ గతంలోలా వికెట్ కీపర్ గా కాకుండా అతను బ్యాటర్ గా మాత్రమే బరిలోకి దిగే అవకాశం ఉందని క్రిక్‌బజ్ నుండి వచ్చిన నివేదిక పేర్కొంది.

Also Read : రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ.. గుడ్‌న్యూస్ చెప్పిన కోహ్లీ.. ఏం పేరు పెట్టారో తెలుసా?

క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రారంభ తేదీ విడుదలైంది. మార్చి 22న టోర్నీ ప్రారంభం కానుంది. ఇండియా వేదికగానే ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మొదటి 15రోజుల షెడ్యూల్ ను మాత్రమే ప్రకటిస్తామని, సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన తరువాత మిగిలిన మ్యాచ్ లజాబితాను నిర్ణయిస్తామని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు