DC vs UPW WPL 2023 : ఢిల్లీ చేతిలో యూపీ చిత్తు.. మెక్ గ్రాత్ చెలరేగినా తప్పని ఓటమి

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో యూపీని చిత్తు చేసింది.

DC vs UPW WPL 2023 : ఢిల్లీ చేతిలో యూపీ చిత్తు.. మెక్ గ్రాత్ చెలరేగినా తప్పని ఓటమి

Updated On : March 7, 2023 / 11:44 PM IST

DC vs UPW WPL 2023 : విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో యూపీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ మొదట ఫీల్డింగ్ చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ మెగ్ లాన్నింగ్ 70, జెస్ 42 పరుగులతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది.

212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూపీ జట్టులో తహిళ మెక్ గ్రాత్ ఒంటరి పోరాటం చేసింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 50 బంతుల్లోనే 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఆమె స్కోర్ లో 11 పోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మెక్ గ్రాత్ చెలరేగి ఆడినా.. ఓవర్లు లేకపోవడంతో ఓటమి తప్పలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ జెస్ జొనాసన్.. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ మెరిసింది. బ్యాటింగ్ 20 బంతుల్లో 42 పరుగులతో చెలరేగిన జెస్.. బౌలింగ్ లో 3 వికెట్లు పడగొట్టి యూపీ ఓటమిలో కీ రోల్ ప్లే చేసింది.