Dean Elgar :కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. నేను బ్యాట్‌తో కొడ‌తాన‌ని హెచ్చ‌రించా.. ఆ ఘ‌ట‌న జ‌రిగిన రెండేళ్ల త‌రువాత ఫోన్ చేసి..

ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు డీన్ ఎల్గ‌ర్ టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Dean Elgar Reveals Shocking Incident Claiming Virat Kohli

Virat Kohli – Dean Elgar : ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు డీన్ ఎల్గ‌ర్ ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కోహ్లీ త‌న పై ఉమ్మి వేశాడ‌ని, దీంతో ఆగ్ర‌హానికి లోనైన తాను బ్యాట్‌తో అత‌డిని కొడ‌తాన‌ని బెదిరించాన‌ని చెప్పాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన రెండు సంవ‌త్స‌రాల త‌రువాత కోహ్లీ క్ష‌మాప‌ణ‌ల చెప్పాడ‌ని, ఆ త‌రువాత ఇద్ద‌రు క‌లిసి పార్టీ చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఇటీవ‌లే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన డీన్ ఎల్గ‌ర్ బాంట‌ర్ విత్ బాయ్స్ అనే ఓ పోస్ట్ కాస్ట్ లో ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

2015లో భార‌త ప‌ర్య‌ట‌నకు ద‌క్షిణాఫ్రికా వ‌చ్చింది. డీన్ ఎల్గ‌ర్‌కు భార‌త‌దేశంలో ప‌ర్య‌టించ‌డం అదే మొద‌టి సారి. ఆ స‌మ‌యంలోనే టీమ్ఇండియా పుల్‌టైమ్ కెప్టెన్‌గా కోహ్లీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. మొహాలీ వేదిక‌గా జ‌రిగిన టెస్టులో ఎల్గ‌ర్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు చెప్పాడు. ఆ వికెట్ పై బ్యాటింగ్ చేయ‌డం ఎంతో క‌ష్టం. బ్యాటింగ్ చేస్తున్న త‌న‌పై భార‌త స్పిన్నర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజాలు స్లెడ్జింగ్ కు దిగారని, వారికి తాను ధీటుగా బ‌దులు ఇచ్చానట్లు తెలిపాడు.

IND vs ENG : సిరాజ్ అవ‌స‌రం లేదు..! రెండో టెస్టులో అత‌డిని ప‌క్క‌న పెట్టండి

‘మ‌ధ్య‌లో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకుని నా పై ఉమ్మేశాడు. నాకు బాగా కోపం వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఓ అస‌భ్య ప‌ద‌జాలం వాడి బ్యాటుతో అత‌డిని కొడ‌తాన‌ని హెచ్చ‌రించాను. అయితే.. నా లాంగ్వేజ్ కోహ్లీకి అర్థ‌మైంది. ఎలాగంటే.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ త‌రుపున ఏబీ డివిలియ‌ర్స్ ఆడ‌డం వ‌ల్ల‌. ఆ త‌రువాత నేను వాడిన అస‌భ్య ప‌దజాలాన్ని ప‌దే ప‌దే అత‌డు వాడుతూ న‌న్ను దూషించాడు. మేము భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాం కాబ‌ట్టి వెన‌క్కి త‌గ్గాల‌ని అనుకున్నా. అందుక‌నే అత‌డి మాట‌ల‌కు ప్ర‌తి స్పందించ‌డం మానేశా.’ అని ఎల్గ‌ర్ అన్నాడు.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన రెండేళ్ల త‌రువాత టీమ్ఇండియా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో కోహ్లీ నాకు ఫోన్ చేశాడు. ఈ సిరీస్ ముగిసిన త‌రువాత మ‌నిద్ద‌రం క‌లిసి డ్రింక్ చేద్దామా..? అని అడిగాడు. భార‌త ప‌ర్య‌ట‌న‌లో నా ప‌ట్ల అలా ప్ర‌వ‌ర్తించినందుకు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడు. దీంతో నేను కూడా ఓకే అని చెప్పాను. సిరీస్ ముగిసిన త‌రువాత కోహ్లీ, నేను తెల్ల‌వారుజామున మూడు గంట‌ల వ‌ర‌కు డ్రింక్ చేస్తూనే ఉన్న‌ట్లు ఎల్గ‌ర్ చెప్పాడు.

Viral Video : క్రికెట్ మ్యాచా.. కామెడీ షోనా.. వీడియో చూస్తే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతారు

కాగా.. ఇటీవ‌ల‌ భార‌త్‌తో టెస్టు సిరీస్ అనంత‌రం ఎల్గ‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఆఖ‌రి టెస్టు మ్యాచు త‌రువాత విరాట్ కోహ్లీ, ఎల్గ‌ర్‌ను ఆత్మీయంగా కౌగించుకుని వీడ్కోలు ప‌లికాడు.

ట్రెండింగ్ వార్తలు