Deepak Chahar -Mohammed Shami
India Vs South Africa : దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ముగిసింది. 1-1తో సిరీస్ సమమైంది. ఇప్పుడు భారత జట్టు వన్డే సిరీస్‌కు సన్నద్దమవుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం వాండరర్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. తండ్రి అనారోగ్యంతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న దీపక్ చాహర్ వన్డే సిరీస్ సైతం ఆడడం లేదని తెలిపింది.
అతడి స్థానాన్ని ఆకాశ్‌దీప్‌తో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. ఆకాశ్‌దీప్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. ఇక దేశవాలీ క్రికెట్‌లో బెంగాల్ తరుపున ఆడిన అతడు మూడు ఫార్మాట్లలో 80 మ్యాచుల్లో 70 కి పైగా వికెట్లు తీశాడు.
? NEWS ?
Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series.
Details ? #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK
— BCCI (@BCCI) December 16, 2023
IND vs ENG : అలా కాదు భయ్యా ఫోటోలు తీసేది.. ఇలా కదా తీయాలి.. భారత మహిళా క్రికెటర్ పాఠాలు..!
అంతేకాకుండా.. చివరి రెండు వన్డేలు శ్రేయస్ అయ్యర్ ఆడడని తెలిపింది. టెస్టు సిరీస్‌కు సన్నద్దమయ్యే క్రమంలో అయ్యర్ చివరి రెండు వన్డేలకు దూరంగా ఉంటాడని చెప్పింది. మహ్మద్ షమీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, దీంతో టెస్టు సిరీస్ నుంచి అతడిని తప్పిస్తున్నట్లు తెలిపింది.