Sushil Arms License: సుశీల్ కుమార్ తుపాకీ లైసెన్స్ రద్దు.. నేరుగా ఇంటికే నోటీసులు

రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్ రద్దు అయింది. సాగర్ రాణా హత్య కేసులో మే 24న సుశీల్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Delhi Police Suspends Arms License Of Sushil Kumar

Arms License of Sushil Kumar : రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్ రద్దు అయింది. సాగర్ రాణా హత్య కేసులో మే 24న సుశీల్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సుశీల్ తుపాకీ లైసెన్స్ రద్దు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సుశీల్ ఇంటికే నేరుగా నోటీసులు జారీ చేశారు.

తుపాకీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసుపై స్పందించడానికి అతనికి 10 రోజుల సమయం ఇచ్చారు. అప్పటిలోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు సూచించారు. ప్రస్తుతం రిమాండులో విచారణస్తున్న సుశీల్‌ను ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు తీసుకువెళ్లారు.

పోలీసు బృందం హరిద్వార్‌లో కునార్ బట్టలు, మొబైల్ ఫోన్‌ కోసం ప్రయత్నించింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు, ఇందులో నీరజ్ బవానా, కాలా అసౌడా ముఠాకు చెందిన పలువురు సభ్యులు ఉన్నారు.

సుశీల్ కుమార్ 2008లో కాంస్య పతకం సాధించాడు. బీజింగ్ ఒలింపిక్ క్రీడలు, 2012 లండన్ ఒలింపిక్ క్రీడలలో రజతాన్ని సొంతం చేసుకున్నాడు.