Chahal, Dhanashree, Dhanashree Verma,Yuzvendra Chahal,Divorce Rumours
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోనున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొన్నాళ్లుగా మీడియాలో వస్తున్న వార్తల వల్ల తాను ఎంతో మానసిక వేదనకు గురి అవుతున్నానని చెప్పుకొచ్చింది.
గత కొన్నాళ్లుగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని ధనశ్రీ చెప్పింది. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారు అని ఆమె మండిపడింది. తన ప్రతిష్టను దిగజార్చేలా, తన పై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడితేనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది. నేను మౌనంగా ఉన్నానంటే.. అది నేను బలహీనంగా ఉన్నట్లు కాదు. అని అంది.
సోషల్ మీడియాలో ప్రతికూలత ఉన్నప్పటికి ఇతరులపై దయ, కరుణ చూపాలంటే అందుకు ధైర్యం అవసరం అని అంది. తాను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, విలువలతో ముందుకు సాగాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదంది.
Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
చాహల్, ధనశ్రీ వర్మలు 2020లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు విడిపోతున్నారు అనే వార్తలు మొదలు అయ్యాయి. అదే సమయంలో చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీతో ఉన్న ఫోటోలను డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరు విడిపోతున్నారు అనే వార్తలకు బలం చేకూరినట్లైంది. కాగా.. గతంలోనూ ఓ సారి వీరిద్దరు విడిపోతున్నారు అనే వార్తలు వైరల్‌గా మారగా.. దీనిపై చాహల్ స్పందిస్తూ విడిపోవడం లేదని క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు తెరపడింది. అయితే.. ఈ సారి ధనశ్రీ గానీ చాహల్‌లు గాని విడాకుల వార్తలపై స్పందించలేదు.