ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. రోహిత్, కోహ్లీల ర్యాంకుల పతనం.. టాప్-10లో భారత ఆటగాళ్లు ఇద్దరే..
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

Virat Kohli And Rohit Sharma Fall in ICC Test Rankings
ICC Player Rankings for Test Batsmen 2025: ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 908 సాధించాడు. అయితే.. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మూడు స్థానాలు దిగజారాడు. 27 వ స్థానానికి పడిపోయాడు. అటు రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి 42వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం మూడు స్థానాలు మెరుగుపరచుకుని తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.
Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే..
జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 908 రేటింగ్ పాయింట్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 841 రేటింగ్ పాయింట్లు
కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 837 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 835 రేటింగ్ పాయింట్లు
మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) – 785 రేటింగ్ పాయింట్లు
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ బ్యాటింగ్ విభాగంలో తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. మరో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్, భారత స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే..
జోరూట్ (ఇంగ్లాండ్) – 895 రేటింగ్ పాయింట్లు
హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 876 రేటింగ్ పాయింట్లు
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 867 రేటింగ్ పాయింట్లు
యశస్వి జైస్వాల్ (భారత్) – 847 రేటింగ్ పాయింట్లు
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 772 రేటింగ్ పాయింట్లు
Rohit Sharma : రోహిత్ శర్మకు లాస్ట్ ఛాన్స్..! దుబాయ్‌లో ఆఖరి మ్యాచ్..?
ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే.. భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్, బంగ్లాదేశ్ ఆటగాడు మెహదీ హసన్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే..
రవీంద్ర జడేజా (భారత్) – 400 రేటింగ్ పాయింట్లు
మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) – 294 రేటింగ్ పాయింట్లు
మెహదీ హసన్ (బంగ్లాదేశ్) – 284 రేటింగ్ పాయింట్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 282 రేటింగ్ పాయింట్లు
షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 263 రేటింగ్ పాయింట్లు
Sizzling performances in the #AUSvIND and #SAvPAK series finales lead to big rewards in the latest ICC Men’s Test Player Rankings 📈#WTC25https://t.co/MAQnGNgFaE
— ICC (@ICC) January 8, 2025