Rohit Sharma : రోహిత్ శర్మకు లాస్ట్ ఛాన్స్..! దుబాయ్‌లో ఆఖరి మ్యాచ్..?
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలం అయ్యాడు.

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలం అయ్యాడు. ఓ కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్‌గానూ అతడు ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఆసీస్ సిరీస్ అనంతరం టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెబుతాడు అన్న వార్తలు వచ్చాయి. అయినప్పటి అలాంటిది ఏమీ జరగలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. బీసీసీఐ మాత్రం హిట్‌మ్యాన్‌కు చివరి అవకాశం ఇవ్వనున్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు వన్డేల్లో నాయకత్వ బాధ్యతలు ఇవ్వనున్నారని, హార్దిక్ సారథ్యంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుందనే వార్తలు వచ్చాయి. అయితే.. రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
Kagiso Rabada : గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు రబాడ వార్నింగ్..
ఈ టోర్నీ కన్నా ముందు ఇంగ్లాండ్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సైతం రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా హిట్‌మ్యాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ కావొచ్చునని చెబుతున్నారు. అదే జరిగితే దుబాయ్‌లోనే రోహిత్ శర్మ ఆఖరి మ్యాచ్ ఆడనున్నాడు.
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ హైబ్రిడ్ మోడ్‌లో జరగనుంది. టీమ్ఇండియా ఆడే మ్యాచులు అన్ని దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. గ్రూపు దశలో భారత జట్టు తన తొలి మ్యాచును ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
Kris Srikkanth – Shubman Gill : గిల్‌కు అంత సీన్ లేదు.. కృష్ణమాచారి శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..