Kagiso Rabada : గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు రబాడ వార్నింగ్..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు చాలా సమయమే ఉన్నప్పటికి కూడా దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ ఆసీస్‌కు హెచ్చరికలు పంపాడు.

Kagiso Rabada issues warning for Australia months ahead of WTC 2025 final
కేప్‌టౌన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా.. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరుకోగా.. అటు భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు చాలా సమయమే ఉన్నప్పటికి కూడా దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ ఆసీస్‌కు హెచ్చరికలు పంపాడు.
పాక్‌తో టెస్టు సిరీస్ అనంతరం దక్షిణాప్రికా స్టార్ పేసర్ మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ఉండబోతుందన్నాడు. అయితే.. ఆస్ట్రేలియాని ఎలా ఓడించాలో తమకు తెలుసునని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎల్లప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. రెండు జట్లు కూడా చాలా సారూప్యంగానే ఆడుతాయి. మమ్మల్ని ఓడించేందుకు ఆస్ట్రేలియా యతవిధాలుగా ప్రయత్నం చేస్తుందనే విషయం తెలుసు. అయితే.. వారిని ఎలా ఓడించాలో మాకు తెలుసునని కగిసో రబాడ అన్నాడు.
Kris Srikkanth – Shubman Gill : గిల్‌కు అంత సీన్ లేదు.. కృష్ణమాచారి శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..
వంద శాతం ఇప్పటికి టెస్టు క్రికెట్‌కు ఇంకా సజీవంగానే ఉందన్నాడు. తాము ఆడుతున్న అత్యుత్తమ ఫార్మాట్ ఇదేనని చెప్పాడు. దిగ్గజ క్రికెటర్లను చూడండి. వారంతా గ్రేటెస్ట్ టెస్టు ప్లేయర్లేనని అన్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 సైకిల్‌లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కగిసో రబాడ నిలిచాడు. 10 టెస్టుల్లో 19.97 సగటుతో 47 వికెట్లు తీశాడు. ఇందులో మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
Yuzvendra Chahal : విడాకుల వార్తల వేళ.. మిస్టరీ గర్ల్‌తో చాహల్..! ఎవరా అమ్మాయి..?
అటు ఆస్ట్రేలియా పై రబాడకు మంచి రికార్డు ఉంది. అతడు 10 టెస్టుల్లో 23.08 సగటుతో 49 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 6/54.
లార్డ్స్‌లో రబాడ ప్రద్శన..
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చే లార్డ్స్ మైదానంలోనూ రబాడకు మంచి గణాంకాలే ఉన్నాయి. ఇక్కడ రెండు టెస్టులు ఆడి 19.38 సగటుతో 13 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 7/79.
Shots fired! #WTCFinal #AUSvSA
Read: https://t.co/spN3DAIWOJ pic.twitter.com/zUtZEluNKr
— cricket.com.au (@cricketcomau) January 7, 2025