Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది

Jasprit Bumrah Out Of Champions Trophy 2025 Report
ఫిబ్రవరి 19 నుంచి ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీకి మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భారత్‌కు అది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. వెన్నునొప్పితో అతడు బాధపడుతున్నట్లు సమాచారం. వర్క్‌లోడ్ పెరగడం వల్ల అతడు ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బృందం బుమ్రాకు విశ్రాంతి అవసరం అని సూచించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దూరం అవుతాడు అనే వార్తలు వచ్చాయి.
Rohit Sharma : రోహిత్ శర్మకు లాస్ట్ ఛాన్స్..! దుబాయ్‌లో ఆఖరి మ్యాచ్..?
అయితే.. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌కే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికే దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బుమ్రాకు అయిన వెన్నుగాయం కాస్త తీవ్రమైనది అని, అతడు కోలుకునేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. అదే జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా విజయావకాశాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో బుమ్రా త్వరగా కోలుకోవాలని, పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
హైబ్రిడ్ మోడ్‌లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. భారత జట్టు ఆడే మ్యాచులు అన్ని దుబాయ్ వేదికగా జరగనున్నాయి. గ్రూపు దశలో భారత్ తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న ఆడనుంది. ఇక యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా వీక్షించే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఇక మార్చి 2న కివీస్‌తో భారత్ ఆడనుంది. వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది.
Yuzvendra Chahal : విడాకుల వార్తల వేళ.. మిస్టరీ గర్ల్‌తో చాహల్..! ఎవరా అమ్మాయి..?
ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జనవరి 9 లేదా 10 తేదీల్లో జట్లను బీసీసీఐ ప్రకటించే ఛాన్స్ ఉంది.