Neeraj Chopra
Diamond League 2024 Final : బ్రస్సెల్స్ లో జరిగిన డైమండ్ లీగ్ 2024 ఫైనల్స్ లో భారత స్టార్ జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో జావెలిన్ త్రోలో నీరజ్ వరుసగా రెండో ఏడాదికూడా రన్నరప్ గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. నీరజ్ ఫైనల్ మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శనే కనబర్చారు. 87.86 మీటర్లు దూరం ఈటెను విసిరాడు. కానీ, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్లు ఈటెను విసిరాడు. కేవలం 0.01 మీటర్లు మాత్రమే నీరజ్ వెనకబడిపోయాడు. దీంతో వరుసగా రెండోసారి చారిత్రాత్మక విజయానికి దూరమై రెండో స్థానంకు పరిమితం అయ్యాడు. నీరజ్ కంటే మెరుగైన ప్రదర్శన చేసిన పీటర్స్ అండర్సన్ ఛాంపియన్ గా నిలిచాడు. ఈ ఈవెంట్ లో జర్మనీకి చెందిన అథ్లెట్ జులియన్ వెబర్ 85.97 మీటర్ల దూరం ఈటెను విసిరి మూడో స్థానంలో నిలిచాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. డైమండ్ లీగ్ లో ఛాంపియన్ గా నిలిచే అథ్లెట్ కు 30వేల యూఎస్ డాలర్లు అందజేస్తారు. అంటే.. పీటర్స్ అండర్సన్ కు దాదాపు రూ. 25లక్షల ఫ్రైజ్ మనీ అందనుంది. రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా 12వేల యూఎస్ డాలర్లు అంటే దాదాపు రూ. 10లక్షలు బహుమతిగా అందుకోనున్నాడు.
Also Read : IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. అశ్విన్ భార్య ఆసక్తికర పోస్ట్..
2022లో డైమండ్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్న మొదటి భారతీయుడుగా నీరజ్ చోప్రా రికార్డు నెలకొల్పాడు. 2023 డైమండ్ లీగ్ ఫైనల్ లో నీరజ్ చోప్రా రెండో స్థానంకు పరిమితం అయ్యాడు. చెక్ రిపబ్లిక్ కు చెందిన యాకుబ్ వల్లేశ్ 84.24 మీటర్ల దూరం ఈటెను విసిరి చాంపియన్ గా నిలిచాడు. ఆ ఏడాది నీరజ్ 83.80 మీటర్ల త్రోతో రెండో స్థానంకు పరిమితం అయ్యాడు. తాజాగా 2024లో జరిగిన పోటీల్లోనూ నీరజ్ చోప్రా రెండో స్థానంకు పరిమితం అయ్యాడు.
Neeraj Chopra hits 8⃣7⃣.8⃣6⃣ m and finishes second in Brussels 👏#DiamondLeagueonJioCinema #DiamondLeagueonSports18 #DiamondLeagueFinal pic.twitter.com/C8WETcMFqB
— JioCinema (@JioCinema) September 14, 2024