Digvesh Rathi : దిగ్వేష్ మ‌ళ్లీ నోట్‌బుక్ సంబరాలు.. ఈ సారి ఏమవుతుందో?

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్పిన్న‌ర్ దిగ్వేష్ రతికి మ‌రో షాక్ త‌గిలేలా క‌నిపిస్తోంది

Courtesy BCCI

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్పిన్న‌ర్ దిగ్వేష్ రతికి మ‌రో షాక్ త‌గిలేలా క‌నిపిస్తోంది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఇప్ప‌టికే అత‌డు రెండు సార్లు జ‌రిమానాల‌ను ఎదుర్కొన్నాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు నోట్‌బుక్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. దీంతో అత‌డికి మూడోసారి ఫైన్ ప‌డే అవ‌కాశం ఉంది.

ఈ సీజ‌న్‌లో దిగ్వేష్ ర‌తి త‌న బౌలింగ్‌తో కంటే.. వికెట్ ప‌డిన‌ప్పుడు అత‌డు చేసుకునే సంబురాల‌తోనే వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలిచాడు. నోట్‌బుక్ సంబ‌రాల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు అత‌డు జ‌రిమానా ఎదుర్కొన్నాడు. దీంతో కొన్ని మ్యాచ్‌ల్లో సాధార‌ణంగా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నా కూడా.. పంజాబ్‌తో మ్యాచ్‌లో మ‌ళ్లీ నోట్‌బుక్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు.

Lucknow Super Giants : పంజాబ్ చేతిలో ఓడినా.. ప్లేఆఫ్స్ చేరుకునేందుకు ల‌క్నోకు ఛాన్సుంది.. ఆ ఒక్క ప‌ని చేస్తే చాలు..

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెన‌ర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ తన సిగ్నేచర్ వేడుకను తిరిగి తీసుకువచ్చాడు. దీంతో దిగ్వేష్ కు బీసీసీఐ మూడోసారి జ‌రిమానాను విధించే అవ‌కాశం ఉన్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌టగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 236 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (91; 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (45), శశాంక్‌ సింగ్‌ (33 నాటౌట్‌) లు రాణించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ రతిలు చెరో రెండు వికెట్లు తీయ‌గా.. ప్రిన్స్ యాద‌వ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

KL Rahul-Virat Kohli : స‌న్‌రైజ‌ర్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ టీ20 రికార్డుపై కేఎల్ రాహుల్ క‌న్ను..

అనంత‌రం ఆయుష్ బ‌దోని (74), అబ్దుల్ స‌మ‌ద్ (45) మెరుపులు మెరిపించిన‌ప్ప‌టికి కూడా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు తీయ‌గా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు, మార్కో జాన్సెన్‌, చాహ‌ల్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.