KL Rahul-Virat Kohli : సన్‌రైజర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ టీ20 రికార్డుపై కేఎల్ రాహుల్ కన్ను..
సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.
ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్. కాగా.. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో అతడు ఓ అరుదైన ఘనతపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 43 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డుకు ఎక్కుతాడు.
ప్రస్తుతం ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 243 ఇన్నింగ్స్‌ల్లో 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. రాహుల్ విషయానికి వస్తే.. 222 ఇన్నింగ్స్‌ల్లో 42.32 సగటు, 136.29 స్ట్రైక్‌రేటుతో 7957 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఆటగాడిగా నిలవనున్నాడు.
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాళ్లు వీరే..
క్రిస్‌గేల్ – 213 ఇన్నింగ్స్‌ల్లో
బాబర్ ఆజాం – 218 ఇన్నింగ్స్‌ల్లో
విరాట్ కోహ్లీ – 243 ఇన్నింగ్స్‌ల్లో
మహ్మద్ రిజ్వాన్ – 244 ఇన్నింగ్స్‌ల్లో
ఆరోన్ ఫించ్ – 254 ఇన్నింగ్స్‌ల్లో
Viral Video : అదెం గుండెరా బాబు.. జేబులోనే పెట్టుకొని వచ్చాడుగా.. పరిగెడుతుండగా జారిపడింది..
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడింది. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్+0.362గా ఉంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. అటు సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌రేట్ -1.192గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది.