SRH : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ కీల‌క నిర్ణ‌యం.. స్మ‌ర‌న్ ర‌విచంద్ర‌న్ స్థానంలో హర్ష్ దూబేకు స్థానం.. ఎవ‌రీ దూబే..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఏదీ క‌లిసి రావడం లేదు

SRH : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ కీల‌క నిర్ణ‌యం.. స్మ‌ర‌న్ ర‌విచంద్ర‌న్ స్థానంలో హర్ష్ దూబేకు స్థానం.. ఎవ‌రీ దూబే..

Sunrisers Hyderabad sign Harsh Dubey as injury replacement for Smaran Ravichandran

Updated On : May 5, 2025 / 10:11 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఏదీ క‌లిసి రావడం లేదు. ఓవైపు వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోండ‌గా మ‌రోవైపు ఆట‌గాళ్ల గాయాలు జ‌ట్టును ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్ప‌టికే స్టార్ స్పిన్న‌ర్ ఆడ‌మ్ జంపా గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరం కాగా అత‌డి స్థానంలో స‌ర్మ‌న్ ర‌విచంద్ర‌న్‌ను జ‌ట్టులోకి తీసుకుంది.

అయితే.. ఇప్పుడు స్మ‌ర‌న్ ర‌విచంద్ర‌న్ సైతం గాయ‌ప‌డ్డాడు. అత‌డి స్థానంలో తాజాగా హ‌ర్ష్ దూబేను తీసుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ తెలియ‌జేసింది. ‘స్మ‌ర‌న్ ర‌విచంద్ర‌న్ గాయ‌ప‌డ్డాడు. అతడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాం. అత‌డి స్థానంలో హ‌ర్ష్ దూబేను తీసుకున్నాం.’ తెలిపింది.

ఎవ‌రీ హ‌ర్ష్ దూబే..?
విద‌ర్భ ఆల్‌రౌండ‌ర్ అయిన హ‌ర్ష్ దూబే దేశ‌వాలీ క్రికెట్‌లో మెరుగైన గ‌ణాంకాల‌ను క‌లిగి ఉన్నాడు. త‌న కెరీర్‌లో 16 టీ20లు, 20 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 18 ఫ్ల‌స్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 127 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 941 ప‌రుగులు సాధించాడు.

హ‌ర్ష్ దూబేను స‌న్‌రైజ‌ర్స్ బేస్ ప్రైజ్ రూ.30ల‌క్ష‌లకే తీసుకుంది.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆరు పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేట్ -1.192గా ఉంది. ఇక నేడు (మే 5 సోమ‌వారం) ఉప్ప‌ల్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సి ఉంది.