Viral Video : అదేం గుండెరా బాబు.. జేబులోనే పెట్టుకొని వచ్చాడుగా.. పరిగెడుతుండగా జారిపడింది..
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది.

Internet Left Stunned As Mobile Phone Slips Out Of Cricketer Pocket Mid Match
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ లో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి చూసింది. బ్యాటర్ రన్స్ తీస్తున్న క్రమంలో అతడి జేబులోంచి మొబైల్ ఫోన్ జారీ పిచ్ పై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది.
కౌంటీ ఛాంపియన్‌షిప్ లో భాగంగా ఇటీవల లంకాషైర్, గ్లౌసెస్టర్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంకాషైర్ ఇన్నింగ్స్ సందర్భంలో ఇది చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 114 ఓవర్‌లో జోష్ షా బౌలింగ్‌లో లంకాషైర్ బ్యాటర్ టామ్ బెయిలీ ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. రెండు పరుగులు తీశాడు.
కాగా.. తొలి పరుగు పూర్తి చేయడానికి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్నప్పుడు అతడి జేబులోంచి మొబైల్ ఫోన్ పడిపోయింది. ఈ వీడియో వైరల్‌గా మారగా.. అతడికి ఫోన్ తీసుకువెళ్లడానికి ఎవరు అనుమతిచ్చారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
— No Context County Cricket (@NoContextCounty) May 3, 2025
ఐసీసీ నిబంధనల ప్రకారం.. సాధారణంగా ఏ ప్లేయర్ కూడా మ్యాచ్ సమయంలో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఏ గాడ్జెట్‌ను తనతో తీసుకెళ్లకూడదు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను ఆటగాళ్లు బస్సు దిగిన వెంటనే లాకర్ లో ఉంచుతారు. మ్యాచ్ తర్వాతే ఆటగాళ్లకు వారి ఫోన్లను తిరిగి ఇస్తారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అంపైర్ల అనుమతితో ఫోన్లను వాడొచ్చు. కానీ.. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి తీసుకువెళ్లేందుకు అనుమతి ఉండదు.
Illegal, surely?
— Arkers (@Thelandofark) May 3, 2025
But how that is allowed?
— Abhinit 🇮🇳 (@KushwahaAbhinit) May 3, 2025