Dinesh Karthik breaks silence on his new role with RCB
టీమ్ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌లో సరికొత్త పాత్రను పోషించేందుకు సిద్ధం అయ్యాడు. మొన్నటి వరకు ఆర్‌సీబీ జట్టులో ప్లేయర్‌గా కొనసాగిన అతడు.. ఇప్పుడు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో తన కొత్త పాత్ర గురించి, జట్టు ప్రదర్శన పై ప్రత్యేకంగా మాట్లాడాడు.
ఆటగాడిగా ఉన్నప్పుడు విలాసవంతమైన జీవితం ఉంటుంది. సాయం చేసేందుకు చుట్టూ చాలా మంది ఉంటారు. అదే కోచ్‌గా ఉంటే మాత్రం మనకు మనమే అన్ని చేసుకోవాలి. పక్కవారికి సాయం చేయాలి. అని దినేశ్ కార్తీక్ ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ చెప్పాడు. సవాళ్లు ఉన్నప్పటికి కొత్త బాధ్యతలు, వేలంలో జట్టు ఎంపిక పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు.
IPL 2025 : ఆర్‌సీబీ పోస్ట్ వైరల్.. చీకటిలో కూడా అతని ప్రకాశం ప్రకాశిస్తుంది.. ఎవరో చెప్పుకోండి ?
వేలంలో మేము బ్యాటింగ్, బౌలింగ్ విభాగంపై దృష్టి సారించాము. ఇప్పుడు జట్టును చూస్తుంటే ఎంతో బాగుందన్నాడు. పేపర్ మీద జట్లు అన్ని బాగానే ఉన్నాయి. అయితే.. మైదానంలో ఎవరు బాగా ఆడితే వారితే విజయం అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
ఆర్‌సీబీలో స్వదేశీ, విదేశీ ప్లేయర్లు అందరిని సమానంగా చూస్తామని కార్తీక్ చెప్పాడు. క్లిష్ట పరిస్థితుల్లో వారు ఎలాంటి పాత్ర పోషించాలనేది చెబుతామన్నాడు.
ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి భారతదేశ సామర్థ్యంపై కార్తీక్ తన ఆలోచనలను కూడా పంచుకున్నారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతోంది. క్రీడలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ప్రతీ క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసే దిశగా పయనిస్తోంది. ఒలింపిక్స్ 2036 నిర్వహణ కోసం మనమంతా సిద్ధంగా ఉన్నామని భావిస్తున్నామని దినేశ్ కార్తీక్ చెప్పాడు.
ఐపీఎల్ 17 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మార్చి 22 నుంచి 18వ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు ఆర్‌సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవలేదు. ఈ సీజన్‌లో యువ ఆటగాడు రజత్ పాటిదార్ నాయతక్వంలో ఆర్‌సీబీ బరిలోకి దిగనుంది. ఈ సారి ఎలాగైన ఆర్‌సీబీ కప్పు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.