Zaheer Khan : జ‌హీర్‌కి మైదానంలో ప్రపోజ్ చేసిన ఫ్యాన్‌.. ఫ్ల‌యింగ్ కిస్‌లు.. క‌ట్ చేస్తే.. 20 ఏళ్ల త‌రువాత మ‌రోసారి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌..

కెమెరా క‌ళ్లు అన్ని ఓ అమ్మాయి ప‌ట్టుకున్న ఫ్లకార్డు పైకి వెళ్లాయి.

Zaheer Khan : జ‌హీర్‌కి మైదానంలో ప్రపోజ్ చేసిన ఫ్యాన్‌.. ఫ్ల‌యింగ్ కిస్‌లు.. క‌ట్ చేస్తే.. 20 ఏళ్ల త‌రువాత మ‌రోసారి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌..

Fan who proposed Zaheer Khan on TV returns with another proposal after 20 years

Updated On : March 15, 2025 / 3:16 PM IST

ఓ వైపు భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య సిరీయ‌స్‌గా మ్యాచ్ జ‌రుగుతోంది. ఇంత‌లో కెమెరా క‌ళ్లు అన్ని ఓ అమ్మాయి ప‌ట్టుకున్న ఫ్లకార్డు పైకి వెళ్లాయి. స్టాంట్స్‌లో కూర్చున్న స‌ద‌రు మ‌హిళా అభిమాని అప్ప‌టి టీమ్ఇండియా పేస‌ర్ జ‌హీర్ ఖాన్‌కు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసింది. క‌ట్ చేస్తే 20 ఏళ్లు గ‌డిచిపోయాయి. ఇప్పుడు స‌ద‌రు మ‌హిళా ఫ్యాన్స్‌ జ‌హీర్ ఖాన్ కంట ప‌డింది. ఈ సారి కూడా మ‌ళ్లీ సేమ్ ఫ్లకార్డు ప‌ట్టుకుని క‌నిపించ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అది.. మార్చి 24, 2005. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 570 ప‌రుగులు చేసింది. అనంత‌రం భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. వికెట్ న‌ష్టానికి 121 ప‌రుగుల‌తో టీమ్ఇండియా ఆడుతోంది. సెహ్వాగ్, ద్ర‌విడ్ లు క్రీజులో ఉన్నారు.

IPL 2025 : ఆర్‌సీబీ పోస్ట్ వైర‌ల్‌.. చీకటిలో కూడా అతని ప్రకాశం ప్రకాశిస్తుంది.. ఎవ‌రో చెప్పుకోండి ?

స‌రిగ్గా ఆ స‌మ‌యంలో కెమెరా క‌ళ్లు అన్ని స్టాంట్స్ లో ఫ్ల‌కార్డు ప‌ట్టుకుని కూర్చుని ఉన్న మ‌హిళా అభిమాని పై ప‌డ్డాయి. దానిపై “జ‌హీర్‌.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” అని రాసి ఉంది. ఇక చెప్పేది ఏముంది.. ఓ వైపు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న జ‌హీర్‌ను మ‌రోవైపు స్టాంట్స్‌లో ఉన్న‌ యువ‌తిని ప‌దే ప‌దే చూపించారు కెమెరామెన్లు.

ఆ స‌మ‌యంలో జ‌హీర్ ప‌క్క‌న యువ‌రాజ్ సింగ్ కూడా ఉన్నాడు. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే స‌ద‌రు యువ‌తి ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చింది. ఇక యువీ ఊరుకుంటాడా చెప్పండి.. జ‌హీర్ అందుకు స్పందించమ‌న్న‌ట్లుగా కోరిన‌ట్లు ఉన్నాడు. దీంతో జ‌హీర్ సైతం ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చాడు.

ఇక చెప్పేది ఏముంది.. త‌న అభిమాన క్రికెట‌ర్ నుంచి ముద్దు అందుకోవ‌డంతో స‌ద‌రు యువ‌తి సిగ్గు ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న కార‌ణంగా దాదాపు ఓ నిమిషం పాటు మ్యాచ్ కూడా ఆగిపోగా.. క్రీజులో ఉన్న సెహ్వాగ్ బిగ్‌స్ర్కీన్ పై దీన్ని చూస్తూ న‌వ్వాడు.

Ishan Kishan : స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్‌కు త‌ల‌నొప్పిగా మారిన ఇషాన్ కిష‌న్‌? బ‌లం అవుతాడునుకుంటే ?

క‌ట్ చేస్తే.. కాల‌చ‌క్రం 20 సంవ‌త్స‌రాలు తిరిగింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మెంటార్ అయిన జ‌హీర్ ఐపీఎల్ 2025 కోసం వ‌చ్చాడు. అత‌డి స్వాగ‌తించ‌డానికి కొంద‌రు అభిమానులు వ‌చ్చారు. అయితే.. ఓ మ‌హిళ “జ‌హీర్‌.. ఐ ల‌వ్ యూ.” అని రాసి ఉన్న ఫ్లకార్డును ప‌ట్టుకుని ఉంది. ఆమె మ‌రెవ‌రో కాదు.. 20 ఏళ్ల క్రితం ప‌ట్టుకున్న అమ్మాయే కావ‌డం విశేషం.

దీన్ని చూసిన జ‌హీర్ ఖాన్ ఆశ్చ‌ర్య‌పోయాడు. అత‌డి ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్ గా మారింది. ఈ వీడియోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. జాక్ ప‌ట్ల మా ప్రేమ నిరంతరం ఉంటుంది అనే క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో ఈ వీడియోతో పాటు 20 ఏళ్ల క్రితం వీడియో సైతం వైర‌ల్‌గా మారింది.