Do you know Hardik Pandya New Rumoured Girlfriend
Hardik Pandya : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అతడు బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్‌లో ఉన్నాడనే రూమర్లు వచ్చాయి. ఇటీవల వీరిద్దరు విడిపోయారని అంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
అయితే.. తాజాగా హార్దిక్ (Hardik Pandya) మరోసారి ప్రేమలో పడ్డాడని అంటున్నారు. మహికా శర్మ అనే మోడల్‌తో డేట్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. దీనిపై అటు హార్దిక్ పాండ్యా గానీ, ఇటు మహికా శర్మ గానీ స్పందించలేదు.
Asia Cup 2025 : పాక్‌కు భంగపాటు.. తలొగ్గని ఐసీసీ.. మ్యాచ్ రిఫరీని తొలగించేది లేదు..
మహికా శర్మ ఎవరు?
* మహికా శర్మ ఒక మోడల్. తానిష్క్, వివో, యూనిక్లో వంటి ప్రముఖ బ్రాండ్లకు యాడ్ క్యాంపెయిన్స్‌లో నటించారు. మణీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తహిలియాని వంటి ప్రముఖ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేశారు.
* 2024లో ఆమె ఇండియన్ ఫ్యాషన్ అవార్డులలో మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూఏజ్) అవార్డు సైతం అందుకున్నారు.
* ఆమె ఎకానామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. చదువు పూర్తి చేసుకున్న తరువాత మోడలింగ్, నటనలో కెరీర్‌ను ఎంచుకున్నారు.
Pathum Nissanka : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాతుమ్ నిస్సాంక అరుదైన ఘనత.. ఒకే ఒక లంక ఆటగాడు..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఆసియాకప్ 2025లో ఆడుతున్నాడు. ఆల్‌రౌండర్‌గా భారత విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. ఇప్పటి వరకు ఆసియాకప్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండింటిలో హార్దిక్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. భారత జట్టు సూపర్-4కు అర్హత సాధించింది.