Pathum Nissanka : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాతుమ్ నిస్సాంక అరుదైన ఘనత.. ఒకే ఒక లంక ఆటగాడు..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో శ్రీలంక స్టార్ ఆటగాడు పాతుమ్ నిస్సాంక (Pathum Nissanka)అరుదైన ఘనత సాధించాడు.

Asia Cup 2025 Pathum Nissanka breaks Sri Lanka record in T20Is
Pathum Nissanka : శ్రీలంక స్టార్ ఆటగాడు పాతుమ్ నిస్సాంక అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో శ్రీలంక తరుపున అత్యధిక సార్లు 50 ఫ్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆసియాకప్ 2025లో భాగంగా సోమవారం హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులు చేయడం ద్వారా అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు కుసల్ మెండిస్, కుసల్ పెరీరాలను అధిగమించాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కుసల్ మెండిస్, కుసల్ పెరీరాలు ఇప్పటి వరకు చెరో 16 సార్లు 50 ఫ్లస్ పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో కలిసి నిస్సాంక 17వ సారి 50 ఫ్లస్ పరుగులను సాధించారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో శ్రీలంక తరుపున అత్యధిక సార్లు 50 ఫ్లస్ పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..
* పాతుమ్ నిస్సాంక – 17 సార్లు
* కుసల్ మెండిస్ – 16 సార్లు
* కుసల్ పెరీరా – 16 సార్లు (16హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ)
* తిలకరత్నె దిల్షాన్ – 14 (13అర్థశతకాలు, ఓ శతకం)
* మహేలా జయవర్ధనే – 10 (9 అర్ధశతకాలు, ఓ సెంచరీ)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు సాధించింది. హాంగ్‌కాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. లంక బౌలర్లలో చమీర రెండు వికెట్లు పడగొట్టాడు. హసరంగ, ధసున్ శనకలు చెరో వికెట్ తీశారు.
Asia Cup 2025 : కరచాలన వివాదం.. ఆసియాకప్‌ను పాక్ బహిష్కరిస్తే.. ఏం జరుగుతుంది?
అనంతరం పాతుమ్ నిస్సాంక (68; 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, వనిందు హసరంగ (20 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడడంతో 150 పరుగుల లక్ష్యాన్ని లంక జట్టు 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.