Do you know how many test matches team india win under Virat Kohli captainy
టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అతడు టీమ్ఇండియా తరుపు 123 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 46.9 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254 నాటౌట్.
ఆటగాడినే కాకుండా ఓ నాయకుడిగా టీమ్ఇండియాకు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు విరాట్ కోహ్లీ. అతడి నాయకత్వంలో టెస్టుల్లో టీమ్ఇండియా ఆడే విధానమే మారిపోయింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో తీవ్రతను తీసుకువచ్చాడు. ఫిట్‌నెస్ కీలకం అని చెప్పాడు. ఇంతకుమునుపెన్నడూ లేని విధంగా ఫాస్ట్ బౌలింగ్‌ను ప్రోత్సహించాడు. టీమ్ఇండియా ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడి, గెలవగలదనే నమ్మకాన్ని కలిగించాడు.
టెస్టుల్లో భారత విజయవంతమైన కెప్టెన్ కోహ్లీనే…
2014లో ఎంఎస్ ధోని నుంచి విరాట్ కోహ్లీ పగ్గాలు అందుకున్నాడు. కోహ్లీ నాయకత్వంలో భారత్ 68 టెస్టులు ఆడింది. ఇందులో 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరే కెప్టెన్ కూడా భారత్‌కు ఇన్ని విజయాలు అందించలేదు. మరో 17 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కెప్టెన్ గా కోహ్లీ విజయశాతం 58.82గా ఉంది. ఇది భారత కెప్టెన్లలోనే అత్యుత్తమైన కాదు.. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిపింది.
టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లు వీరే..
విరాట్ కోహ్లీ – 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు
ఎంఎస్ ధోని – 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలు
సౌరవ్ గంగూలీ – 49 మ్యాచ్‌ల్లో 21 విజయాలు
IPL 2025 : మే 16 నుంచే ఐపీఎల్..! నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు..!
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41)లు మాత్రమే కెప్టెన్లుగా కోహ్లీ కంటే ఎక్కువ విజయాలు అందుకున్నారు.