Rohit Sharma : వన్డేల్లో రిటైర్‌మెంట్ పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజే రిటైర్‌మెంట్ ఇస్తా..
వన్డేల్లో రిటైర్‌మెంట్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Team India star player Rohit Sharma breaks silence on ODI Retirement
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం హిట్‌మ్యాన్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. తాజాగా వన్డే క్రికెట్ లో రిటైర్‌మెంట్ గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
సీనియర్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన కెరీర్‌లో తాను చాలా విమర్శలను ఎదురొన్నట్లు చెప్పుకొచ్చాడు. విమర్శలు ఎవ్వరిని ప్రభావితం చేయవని తాను చెప్పడం లేదని, కొందరిని అవి ప్రభావితం చేయవచ్చునని, మరికొందరిని చేయలేవన్నాడు. కాలక్రమేణా వాటిని ఎలా ఎదుర్కొనాలో నేర్చుకుంటారన్నాడు. ఆటగాడి కెరీర్‌లో విమర్శలు అనేవి ఒక భాగమన్నాడు.
IPL 2025 : ఎవ్వరితో మాకు సంబంధం లేదు.. మా రూటే సపరేట్ అంటున్న గుజరాత్ టైటాన్స్..
ఇక తన వన్డే భవిష్యత్తు గురించి రోహిత్ మాట్లాడుతూ.. తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందన్నాడు. ఎన్నాళ్లు ఆడాలనే దానిపై తనకు పూర్తి స్పష్టత ఉందన్నాడు. కెరీర్ ఆరంభంలో, ఇప్పుడు తన ఆట ఎలా పరిణితి చెందిందో వివరించాడు. గతంలో తాను క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించేవాడినని చెప్పుకొచ్చాడు.
‘తొలి 10 ఓవర్లలో 30 బంతులు ఆడి 10 పరుగులే చేసేవాడిని. ఇప్పుడు 20 బంతులు ఆడితే.. 30, 35 లేదా 45 పరుగులు ఎందుకు చేయలేను? తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేయడం నేరం ఏం కాదు.. నేను కూడా ఇలాగే ఆడాలని అనుకుంటున్నాను.’ అని రోహిత్ అన్నాడు.
ప్రత్యేకంగా తాను నిరూపించుకోవాల్సింది ఇంకా ఏమీ లేదన్నాడు. ‘నేను.. అనుకున్న పరుగులు సాధించాను. ఇప్పుడు నేను వేరే విధంగా క్రికెట్‌ను ఆడాలని అనుకుంటున్నాను. అలాగని దేనిని తేలికగా తీసుకోవడం లేదు. విషయాలు ఇలాగే కొనసాగుతాయని, 20 లేదా 30 పరుగులు చేస్తూ ఆడుతూనే ఉంటానని అనుకోకండి. నేను చేయాలని అనుకున్నది మైదానంలో చేయలేని రోజున ఖచ్చితంగా ఆడడం మానేస్తాను.’ అని రోహిత్ శర్మ తెలిపాడు. తన బ్యాటింగ్ జట్టుకు ఉపయోగపడుతుందని తనకు తెలుసునని చెప్పాడు.
IPL 2025 : మే 16 నుంచే ఐపీఎల్..! నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు..!
రోహిత్ శర్మ ఇప్పటి వరకు భారత్ తరుపున 273 వన్డేలు ఆడాడు. 48.8 సగటు 92.8 స్ట్రైక్‌రేటుతో 11,168 పరుగులు చేవాడు. ఇందులో 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.