Site icon 10TV Telugu

Mohammed Siraj : టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ సిరాజ్ ఆస్తి ఎంతో తెలుసా? ఐపీఎల్ ద్వారా గ‌ట్టిగానే..

Do you know Mohammed Sirajs net worth in 2025

Do you know Mohammed Sirajs net worth in 2025

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌యంతో ముగించి, సిరీస్‌ను 2-2తో టీమ్ఇండియా స‌మం చేసింది అంటే అందుకు కార‌ణం హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్ ఆఖ‌రి రోజున సిరాజ్ ప్ర‌ద‌ర్శ‌న గురించి ఎంత చెప్పిన త‌క్కువే.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండు జ‌ట్ల‌లోనూ ఐదు మ్యాచ్‌లు ఆడిన ఏకైక పేస‌ర్ అత‌డే. అంతేకాదు ఏకంగా 1,113 బంతులు విసిరాడు. 23 వికెట్లు తీసి భార‌త విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో సిరాజ్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

నిక‌ర ఆస్తి ఎంత‌?
టీమ్ఇండియా ధ‌నిక క్రికెట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ ఒక‌డు. అత‌డి నిక‌ర ఆస్తుల విలువ దాదాపు రూ.57 కోట్ల ఉంటుంద‌ని అంచ‌నా. బీసీసీఐ జీతం, ఐపీఎల్ ఆదాయం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్య‌క్తిగ‌త పెట్టుబ‌డులు అత‌డి ఆదాయ మార్గాలు.

Pro Kabaddi League : క్రికెట్ ముగిసింది.. ఇక క‌బ‌డ్డీ మొద‌లు కానుంది.. ప్రో క‌బ‌డ్డీ 12వ సీజ‌న్ ఎప్పుడంటే..?

బీసీసీఐ నుంచి ఎంతంటే..?
భారత కీల‌క పేస‌ర్ల‌లో ఒక‌డైన సిరాజ్ 2024-25 సీజ‌న్ కోసం బీసీసీఐ ప్ర‌క‌టించిన కాంట్రాక్టు జాబితాలో గ్రేడ్ ఏలో ఉన్నాడు. దీంతో అత‌డికి బీసీసీఐ నుంచి 5 కోట్ల వార్షిక వేత‌నాన్ని అందుతుంది. అంతేకాదండోయ్‌.. అత‌డు ఆడే మ్యాచ్‌ల‌కు సంబంధించి ఫీజును అందుకుంటాడు. ఒక్కొ టెస్టు రూ.15ల‌క్ష‌లు, వ‌న్డేకి రూ.6ల‌క్ష‌లు, టీ20కి రూ.3లక్ష‌ల‌ చొప్పున ల‌భిస్తుంది. మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన సంద‌ర్భాల్లో అంటే ఐదు వికెట్లు తీసిన స‌మ‌యంలో బోన‌స్‌గా రూ.5ల‌క్ష‌లు బోన‌స్‌గా అందుతాయి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండు సార్లు సిరాజ్ 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన సంగ‌తి తెలిసిందే.

ఐపీఎల్ ద్వారా..
సిరాజ్ 2017లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. 2017లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత‌డికి రూ.2.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ త‌రువాత అదే జీతంతో 2018 నుంచి 2021 వ‌ర‌కు ఆర్‌సీబీకి ఆడాడు. 2022 మెగావేలంలో అత‌డిని ఆర్‌సీబీ రూ.7 కోట్ల‌కు కొనుగోలు చేసింది. 2022 నుంచి 2024 వ‌ర‌కు అత‌డు అదే సాల‌రీని పొందాడు. ఇక 2025 మెగావేలంలో అత‌డిని గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు రూ.12.25 కోట్లకు సొంతం చేసుకుంది.

Team India : టాస్ గురించి ఇక టెన్ష‌న్ అక్క‌ర‌లేదు.. జ‌న‌వ‌రి 2025 నుంచి టీమ్ఇండియా రికార్డు చూస్తే మెంట‌లే..

ల‌గ్జరీ ఇల్లు..
వన్‌క్రికెట్ నివేదిక ప్ర‌కారం.. హైద‌రాబాద్‌లో జ‌న్మించిన ఈ పేస‌ర్ జూబ్లీహిల్స్‌లో రూ.13 కోట్ల విలాస‌వంత‌మైన నివాసం ఉంది. ఈ ఏడాదే అత‌డు ఈ ఇంట్లోకి మారాడు.

‘బ్రాండ్‌’ బాజా..
సిరాజ్ అనేక బ్రాండ్ల‌తో ఒప్పందాల‌ను క‌లిగి ఉన్నాడు. మై 11 స‌ర్కిల్‌, కాయిన్ స్విచ్ కుబేర్‌, ఎజీ క్రికెట్‌, నిప్ప‌న్ పెయింట్స్‌, మై ఫిట్‌నెస్ వంటి హై-ప్రొఫైల్ బ్రాండ్‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా ఉన్నాడు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.

కార్ కలెక్షన్..
సిరాజ్‌కు కార్లంటే చాలా ఇష్టం. అత‌డి కార్ల గ్యారేజీలో రేంజ్ రోవర్ వోగ్ (రూ.2.4 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ ఎస్‌-క్లాస్ (రూ.1.8 కోట్లు), BMW 5 సిరీస్ (రూ69 లక్షలు), టయోటా కరోలా (రూ.20 లక్షలు) ఉన్నాయి. అంతేకాదండోయ్‌.. 2021లో గ‌బ్బా టెస్టులోని అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను ఆనంద్ మ‌హీంద్రా 2021లో అత‌డికి మ‌హీంద్రా థార్ కారును బ‌హుమతిగా ఇచ్చాడు.

Virat Kohli-Rohit Sharma : ఇంగ్లాండ్‌లో అద‌ర‌గొట్టిన టీమ్ఇండియా.. కోహ్లీ, రోహిత్‌ల‌కు మొద‌లైన క‌ష్టాలు? అంతా గంభీర్ చేతుల్లోనే?

ఆసియా క‌ప్‌లో ఆడతాడా?
ఇంగ్లాండ్ పై టెస్టు సిరీస్‌లో రాణించిన సిరాజ్ హైద‌రాబాద్‌కు చేరుకున్నాడు. దాదాపు నెల రోజుల విరామం త‌రువాత టీమ్ఇండియా సెప్టెంబ‌ర్‌లో ఆసియా క‌ప్‌లో ఆడ‌నుంది. టీ20 ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీలో సిరాజ్ ఆడ‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు. అత‌డితో పాటు బుమ్రాకు ఈమెగా టోర్నీ నుంచి విశ్రాంతి ఇస్తార‌ని అంటున్నారు. చూడాలి మ‌రీ బీసీసీఐ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో.

Exit mobile version