Team India : టాస్ గురించి ఇక టెన్ష‌న్ అక్క‌ర‌లేదు.. జ‌న‌వ‌రి 2025 నుంచి టీమ్ఇండియా రికార్డు చూస్తే మెంట‌లే..

సాధార‌ణంగా క్రికెట్‌లో టాస్‌లు కీల‌క పాత్ర పోషిస్తుంటాయి.

Team India : టాస్ గురించి ఇక టెన్ష‌న్ అక్క‌ర‌లేదు.. జ‌న‌వ‌రి 2025 నుంచి టీమ్ఇండియా రికార్డు చూస్తే మెంట‌లే..

Team India did not concerned about toss anymore since January 2025 stunning record

Updated On : August 6, 2025 / 2:57 PM IST

సాధార‌ణంగా క్రికెట్‌లో టాస్‌లు కీల‌క పాత్ర పోషిస్తుంటాయి. టాస్ గెలిచిన కెప్టెన్.. పిచ్, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలా, లేదంటే ఫీల్డింగ్ తీసుకోవాలా అనేది నిర్ణ‌యించుకుంటాడు. టాస్ గెలిస్తే స‌గం మ్యాచ్ గెలిచిన‌ట్లే అనే సామెత కూడా క్రికెట్‌లో వినిపిస్తూ ఉంటుంది.

అయితే..ఇటీవ‌ల కాలంలో భార‌త జ‌ట్టు త‌రుచుగా టాస్‌లు ఓడిపోతూ ఉంటుంది. ఇంగ్లాండ్‌తో లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా జ‌రిగిన చివ‌రి టెస్టు మ్యాచ్‌లోనూ భార‌త్ టాస్ ఓడిపోయింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో భార‌త జ‌ట్టు ఇలా టాస్‌లు ఓడిపోవ‌డం ఇది వ‌రుస‌గా 15వ సారి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడిన భార‌త్ 6 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి సిరీస్‌ను 2-2తో స‌మం చేసింది.

Asia Cup 2025 : బుమ్రా, రాహుల్‌ ఔట్‌? గిల్‌, జైస్వాల్ రీఎంట్రీ! ఆసియా క‌ప్‌లో చోటు ద‌క్కించుకునేది ఎవ‌రో?

ఎప్ప‌టి నుంచి మొద‌లైందంటే..?

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో పూణే వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్ ద్వారా భార‌త జ‌ట్టు టాస్ ఓడిపోవ‌డం మొద‌లైంది. నాలుగో మ్యాచ్‌తో పాటు ఐదో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త కెప్టెన్‌ సూర్య‌కుమార్ యాద‌వ్ టాస్ ఓడిపోయాడు. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భార‌త్ వ‌రుస‌గా 15, 150 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

ఇంగ్లాండ్‌తోనే జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌లోనూ టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్‌లు ఓడిపోయాడు. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో భార‌త్ విజ‌యం సాధించి సిరీస్‌ను 3-0తో కైవ‌సం చేసుకుంది. ఆ త‌రువాత ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ ఇదే క‌థ పునార‌వృత‌మైంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమ్ఇండియా టాస్ ఓడిపోయింది. అయితే.. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఛాంపియ‌న్స్ ట్రోఫీని ముద్దాడింది.

Team India : ఓవ‌ల్‌లో టీమ్ఇండియా బాల్ టాంప‌రింగ్..? అక్క‌సు వెళ్ల‌గ‌క్కిన పాక్ మాజీ క్రికెట‌ర్‌..

టాస్‌లు ఓడే ప‌రంప‌ర‌ను శుభ్‌మ‌న్ గిల్ కూడా కంటిన్యూ చేశాడు. ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిపోయాడు. ఇందులో భార‌త జ‌ట్టు రెండు మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

ఓవ‌రాల్‌గా తీసుకుంటే.. టీమ్ఇండియా వ‌రుస‌గా 15 అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా 13 మ్యాచ్‌ల్లో గెలుపొంద‌డం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 15 టాస్‌లు ఓడినా భారతదేశం సాధించిన రికార్డు..

ఫార్మాట్ ఆడిన మ్యాచ్‌లు గెలిచింది ఓడిపోయింది డ్రా
టెస్టులు 5 2 2 1
వ‌న్డేలు 8 8 0
టీ20లు 2 2 0