Asia Cup 2025 : బుమ్రా, రాహుల్ ఔట్? గిల్, జైస్వాల్ రీఎంట్రీ! ఆసియా కప్‌లో చోటు దక్కించుకునేది ఎవరో?
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది.

Asia Cup 2025 Is Shreyas Iyer Shubman Gill re entry in t20s
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముగియడంతో టీమ్ఇండియా ఆటగాళ్లకు సుదీర్ఘ విరామం లభించింది. దాదాపు 35 రోజుల పాటు ఆటగాళ్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపనున్నారు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. యూఏఈ వేదికగా ఈ మెగాటోర్నీ జరగనుంది.
మొత్తం 8 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 10న తలపడనుంది. ఆ తరువాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 14న ఆడనుంది. ఈ టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.
ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆసియా కప్‌లో పాల్గొనే టీమ్ఇండియా జట్టు పై పడింది. టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుండడంతో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాత్ కోహ్లీలు ఆడరు. ఎందుకంటే వీరిద్దరు ఇప్పటికే టెస్టులతో పాటు టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Team India : ఓవల్‌లో టీమ్ఇండియా బాల్ టాంపరింగ్..? అక్కసు వెళ్లగక్కిన పాక్ మాజీ క్రికెటర్..
ఆగస్టు మూడో వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ మెగాటోర్నీకి టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ టోర్నీ ముగిసిన తరువాత టీమ్ఇండియాకు తీరికలేని షెడ్యూల్ ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు బుమ్రాను తాజా ఉంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు జట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. గతకొన్నాళ్లుగా బిజీ షెడ్యూల్ వల్ల గిల్, జైస్వాల్‌లు టీమ్ఇండియా తరుపున టీ20లు ఆడలేదు. ఇప్పుడు నెలరోజులకు పైగా విశ్రాంతి లభించడంతో వారు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు.
వీరిద్దరు ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. జైస్వాల్ 160 స్ట్రైక్‌రేటుతో 559 పరుగులు చేయగా, గిల్ 155కి పైగా స్ట్రైక్‌రేటుతో 650 రన్స్ చేశాడు. అటు సాయి సుదర్శన్ సైతం 156 స్ట్రైక్‌రేటుతో 759 పరుగులు చేశాడు.
అటు హెర్నియా సర్జరీ నుంచి కోలుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఆసియా కప్ వరకు అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే.. పాండ్యా సారథ్యంలో భారత్ బరిలోకి దిగొచ్చు. ఐపీఎల్‌లో అద్భుత ప్రద్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారత టీ20 టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సంజూ శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, జితేశ్ శర్మ జట్టులో చోటు దక్కించుకోవచ్చు. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది.