Pro Kabaddi League : క్రికెట్ ముగిసింది.. ఇక కబడ్డీ మొదలు కానుంది.. ప్రో కబడ్డీ 12వ సీజన్ ఎప్పుడంటే..?
ప్రో కబడ్డీ 12వ సీజన్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది.

Pro Kabaddi League season 12 Starts from August 29
ఇంగ్లాండ్ పర్యటనను భారత జట్టు అద్భుతమైన విజయంతో ముగించింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. అప్పటి వరకు భారత జట్టు మరో మ్యాచ్ లేదు. అంటే దాదాపు టీమ్ఇండియా ఆటగాళ్లకు 35 రోజుల సుదీర్ఘ విరామం లభించనుంది. అయితే.. అప్పటి వరకు భారత క్రీడాభిమానులకు అలరించేందుకు కబడ్డీ ప్రీమియర్ లీగ్ సిద్ధమైంది.
ప్రో కబడ్డీ 12వ సీజన్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. 12 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. వైజాగ్‌లోని రాజీవ్ గాందీ ఇండోర్ స్టేడియంలో ఆరంభ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం నాలుగు నగరాల్లో వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. తెలుగు టైటాన్స్ ఈ సారి తమ హోం గ్రౌండ్‌ను హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు మార్చుకుంది. తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 29న తమిళ తలైవాస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే 12వ సీజన్‌కు తెరలేవనుంది.
వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 29న – తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్
ఆగస్టు 29న – బెంగళూరు బుల్స్ vs పుణెరి పల్టన్
ఆగస్టు 30న – తెలుగు టైటాన్స్ vs యూపీ యోధాస్
ఆగస్టు 30న – యు ముంబా vs గుజరాత్ జెయింట్స్
ఆగస్టు 31న – తమిళ్ తలైవాస్ vs యు ముంబా
ఆగస్టు 31న – బెంగాల్ వారియర్జ్ vs హర్యానా స్టీలర్స్
సెప్టెంబర్ 1న – పట్నా పైరేట్స్ vs యూపీ యోధాస్
సెప్టెంబర్ 1న – పుణెరి పల్టన్ vs గుజరాత్ జెయింట్స్
సెప్టెంబర్ 2న – దబాంగ్ ఢిల్లీ K.C. vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 2న – జైపూర్ పింక్ పాంథర్స్ vs పట్నా పైరేట్స్
సెప్టెంబర్ 3న – పుణెరి పల్టన్ vs బెంగాల్ వారియర్జ్
సెప్టెంబర్ 3న – హర్యానా స్టీలర్స్ vs యు ముంబా
సెప్టెంబర్ 4న – జైపూర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్
సెప్టెంబర్ 4న – పుణెరి పల్టన్ vs దబాంగ్ ఢిల్లీ K.C.
సెప్టెంబర్ 5న – యు ముంబా vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 5న – హర్యానా స్టీలర్స్ vs యూపీ యోధాస్
సెప్టెంబర్ 6న – పట్నా పైరేట్స్ vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 6న – తమిళ్ తలైవాస్ vs గుజరాత్ జెయింట్స్
సెప్టెంబర్ 7న – బెంగాల్ వారియర్జ్ vs తెలుగు టైటాన్స్
సెప్టెంబర్ 7న – దబాంగ్ ఢిల్లీ K.C. vs జైపూర్ పింక్ పాంథర్స్
సెప్టెంబర్ 8న – హర్యానా స్టీలర్స్ vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 8న – పుణెరి పల్టన్ vs పట్నా పైరేట్స్
సెప్టెంబర్ 9న – దబాంగ్ ఢిల్లీ K.C. vs బెంగాల్ వారియర్జ్
సెప్టెంబర్ 9న – గుజరాత్ జెయింట్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
సెప్టెంబర్ 10న – యు ముంబా vs తెలుగు టైటాన్స్