Do you know Virat Kohli and Rohit Sharma Vijay Hazare Trophy Salaries
Vijay Hazare Trophy : దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ టోర్నీలో ఆడుతుండడమే అందుకు కారణం. అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20లు, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. బీసీసీఐ ఆదేశాల మేరకు రో-కో ద్వయం దేశవాళీల్లో ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ ఢిల్లీ తరుపున ముంబై తరుపున రోహిత్ శర్మ మ్యాచ్‌లు ఆడుతున్నారు.
ఇక వీరిద్దరు బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌ల్లో శతకాలతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక రెండో రౌండ్‌లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగగా రోహిత్ మాత్రం డకౌట్ అయ్యారు.
Harmanpreet Kaur : చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీ20ల్లో ఏకైక కెప్టెన్..
ఐపీఎల్ మ్యాచ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేటప్పుడు కోట్లలో సంపాదించే వీరిద్దరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడడం ద్వారా ఎంత సంపాదిస్తారు అన్న ప్రశ్న ప్రస్తుతం అందరిలో ఉంది.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రోహిత్, కోహ్లీలు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడారు. ఈ టోర్నీలో మ్యాచ్ ఫీజు అనేది ప్లేయర్లు ఆడిన లిస్ట్ ఏ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుంది.
సీనియర్ కేటగిరీ (40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)
* తుదిజట్టులో ఉండే ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ. 60 వేలు
* రిజర్వు ప్లేయర్లకు – మ్యాచ్‌కు రూ.30 వేలు
మిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)
* తుది జట్టులో ఉండే ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ.50 వేలు
* రిజర్వు ప్లేయర్లకు మ్యాచ్‌కు రూ. 25 వేలు
జూనియర్ కేటగిరీ (0- 20 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)
తుది జట్టులో ఉండే ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ. 40 వేలు
రిజర్వు ప్లేయర్లకు మ్యాచ్‌కు రూ.20 వేలు
రోజువారీ అలవెన్సులు
రవాణా, భోజనం ఖర్చులు, వసతి ఏర్పాటు
ప్రదర్శన ఆధారంగా బోనస్‌లు
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ. 10 వేలు
ప్రైజ్‌మనీ
నాకౌట్ దశకు చేరిన, ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్‌పూల్ ఆధారంగా నజరానా ఇస్తారు.
రోహిత్, కోహ్లీలకు ఎంతంటే..?
వీరిద్దరు ఇప్పటికే 40కి పైగా లిస్ట్ ఎ మ్యాచ్‌ల టార్గెట్‌ను ఎప్పుడో దాటేశారు కాబట్టి వీరిద్దరు మ్యాచ్‌కు రూ.60వేలు అందుకుంటారు. దీనితో పాటు బోనస్, అలవెన్సులు వంటివి అదనం.