Do you know What Is Indias ODI Record in Australian Soil against Australia
IND vs AUS : ఆదివారం (అక్టోబర్ 19) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత జట్టు ఆసీస్‌కు చేరుకుంది. రెండు జట్లు కూడా ప్రాక్టీస్‌ను మొదలెట్టాయి. మ్యాచ్‌ల్లో విజయం సాధించేందుకు ఇరు జట్లు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుండగా, మిచెల్ మార్ష్ ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
హెడ్-టు-హెడ్ రికార్డులు..
భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు 152 వన్డేల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 84 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్ 58 మ్యాచ్‌ల్లో గెలిచింది.
ఆసీస్ గడ్డపై..
ఆస్ట్రేలియాలో ఆసీస్ పై భారత రికార్డు ఏమంత గొప్పగా లేదు. ఆసీస్ గడ్డ పై భారత్, ఆస్ట్రేలియా జట్లు 54 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 38 మ్యాచ్‌ల్లో గెలవగా, భారత్ కేవలం 14 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
ఆసీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్..
ఆసీస్ గడ్డ పై ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 19 వన్డేల్లో 58.23 సగటుతో 990 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 171 పరుగులు. 2016లో పెర్త్‌లో ఈ స్కోరును సాధించాడు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే : అక్టోబర్ 19 (పెర్త్ వేదికగా)
* రెండవ వన్డే : అక్టోబర్ 23 (అడిలైడ్)
* మూడో వన్డే : అక్టోబర్ 25 (సిడ్నీ )
IND vs AUS : భారత్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.