Virat Kohli : ఆసీస్‌తో తొలి వ‌న్డే.. స‌చిన్ ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే ఛాన్స్‌.. కోహ్లీ సాధించేనా..?

ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డేకు ముందు విరాట్ కోహ్లీని (Virat Kohli) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Virat Kohli : ఆసీస్‌తో తొలి వ‌న్డే.. స‌చిన్ ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే ఛాన్స్‌.. కోహ్లీ సాధించేనా..?

IND VS AUS Virat Kohli needs only 1 century to break Sachin Tendulkars world record

Updated On : October 17, 2025 / 11:18 AM IST

Virat Kohli : భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఆదివారం (అక్టోబ‌ర్ 19) నుంచి ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య పెర్త్ వేదిక‌గా వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఆసీస్‌తో వ‌న్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో కోహ్లీ ఒక్క సెంచ‌రీ చేస్తే చాలు సచిన్ పేరిట ఉన్న ఓ ప్ర‌పంచ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.

సచిన్ టెండూల్క‌ర్ 1989లో అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. త‌న సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడి 51 శ‌త‌కాలు సాధించాడు. ఈ క్ర‌మంలో ఓ ఫార్మాట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు.

Womens World Cup 2025 : దంచికొట్టిన అలిస్సా హీలీ.. సెమీస్‌లో అడుగుపెట్టిన ఆసీస్‌..

మ‌రోవైపు విరాట్ కోహ్లీ 2008 లో అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. త‌న వ‌న్డే కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 302 మ్యాచ్‌లు ఆడాడు. 51 సెంచ‌రీలు చేశాడు. ఈ నేప‌థ్యంలో ఓ ఫార్మాట్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన స‌చిన్ రికార్డును స‌మం చేశాడు. ఇక ఇప్పుడు ఆసీస్‌తో సిరీస్‌లో కోహ్లీ ఒక్క సెంచ‌రీ చేసినా చాలు.. ఓ ఫార్మాట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన ఆట‌గాడిగా సచిన్ ను అధిగ‌మించి చ‌రిత్ర సృష్టిస్తాడు.

వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డు..

వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డు ప్రస్తుతం కోహ్లీ పేరిటే ఉంది. కోహ్లీ 51 శ‌త‌కాలు చేశాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ (49 శ‌త‌కాలు) రికార్డును బ్రేక్ చేశాడు. ఆ త‌రువాత ద‌క్షిణాఫ్రికా పై 50 వ శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాక్ 51వ సెంచ‌రీని సాధించాడు.

ఇక ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. స‌చిన్ 100 సెంచ‌రీలు సాధించ‌గా.. ఈ ఘ‌న‌త సాధించేందుకు కోహ్లీ మ‌రో 18 శ‌త‌కాలు అవ‌స‌రం.

భారత్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా వ‌న్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి వన్డే : అక్టోబర్ 19 (పెర్త్ వేదిక‌గా)
* రెండవ వన్డే : అక్టోబర్ 23 (అడిలైడ్)
* మూడో వ‌న్డే : అక్టోబర్ 25 (సిడ్నీ )

IND vs AUS : భార‌త్‌తో తొలి వ‌న్డే మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..

ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మ‌ద్‌ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.