×
Ad

IND vs SA : మంగ‌ళ‌వారం నుంచే టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

మంగ‌ళ‌వారం నుంచి భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA) టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Do You Know Where To free Watch Ind Vs Sa t20 Series Schedule here

IND vs SA : ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉంది. టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్లీప్ చేసుకోగా వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. దీంతో మంగ‌ళ‌వారం (డిసెంబ‌ర్ 9) నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

గిల్ వ‌చ్చేశాడు..

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా శుభ్‌మ‌న్ గిల్ గాయ‌ప‌డ్డాడు. కేవ‌లం మూడు బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న అత‌డికి మెడ ప‌ట్టేసింది. దీంతో అత‌డు మైదానాన్ని వీడాడు. రెండో ఇన్నింగ్స్‌లో అత‌డు బ్యాటింగ్‌కు రాలేదు. ఈ క్ర‌మంలో రెండో టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యాడు.

Team India : 2025లో వన్డేల్లో టీమ్ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ ఎవ‌రో తెలుసా?

హెడ్‌-టు-హెడ్‌..

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్, ద‌క్షిణాప్రికా జ‌ట్ల మ‌ధ్య 31 టీ20 మ్యాచ్‌లు జ‌రిగాయి. ఇందులో భార‌త్ 18 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా, 12 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. ఇక స్వ‌దేశంలో భార‌త్ 5 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా సౌతాఫ్రికా 4 మ్యాచ్‌ల్లో గెలిచింది.

ఎక్క‌డ ఫ్రీగా చూడొచ్చంటే..?

టీ20 సిరీస్‌లోని మ్యాచ్‌లు టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారం కానున్నాయి. ఇక ఆన్‌లైన్‌, మొబైల్ ఫోన్‌ల‌లో జియో హ‌ట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సిమ్ వినియోగ‌దారులు ప్ర‌త్యేక రిచార్జ్‌ ఫ్లాన్స్ క‌లిగి ఉంటే.. వారికి జియో హ‌ట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా వ‌స్తుంది. హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్న‌వారు మ్యాచ్‌ల‌ను ఫ్రీగా చూడొచ్చు.

Rohit-Kohli : రోహిత్ శర్మ, కోహ్లీ మళ్లీ బరిలో దిగేది ఎప్పుడు.. నెక్ట్స్ డేట్ ఇదే..

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 – డిసెంబర్ 9న‌ (కటక్)
* రెండో టీ20 – డిసెంబర్ 11న‌ (ముల్లాన్‌పూర్)
* మూడో టీ20 – డిసెంబర్ 14న‌ (ధర్మశాల)
* నాలుగో టీ20 – డిసెంబర్ 17న (లక్నో)
* ఐదో టీ20 – డిసెంబర్ 19న‌ (అహ్మదాబాద్)

టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్