Team India : 2025లో వన్డేల్లో టీమ్ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరో తెలుసా?
ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో భారత్ (Team India) అద్భుతమైన విజయాలను సాధించింది.
Do you know Who finished with most runs for India in ODIs in 2025
Team India : ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో భారత్ అద్భుతమైన విజయాలను సాధించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఈ సంవత్సరం ఆరంభంలో ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ గెలవడంతో భారత్ (Team India)జోరు ప్రారంభమైంది. ఇక తాజాగా కేఎల్ రాహుల్ సారథ్యంలో దక్షిణాఫ్రికా పై 2-1 తేడాతో స్వదేశంలో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మాత్రమే భారత్ ఓడిపోయింది.
ఈ ఏడాది వన్డేల్లో పలువురు ఆటగాళ్లు ఎంతో నిలకడను ప్రదర్శించారు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత వన్డేల్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికి ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ ప్రదర్శనతో సమాధానాలు చెప్పారు.
ఇక వీరిద్దరు ఈ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచాడు. కోహ్లీ 13 మ్యాచ్‌ల్లో 651 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 650 పరుగులు చేశాడు.
పక్కటెముక గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అతడు 11 మ్యాచ్‌ల్లో 496 పరుగులు చేశాడు. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 11 మ్యాచ్‌ల్లో 490 పరుగులు సాధించాడు.
Rohit-Kohli : ఈ ఏడాది ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనిపించరు.. మళ్లీ వచ్చే ఏడాదే..
2025లో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 651 పరుగులు
* రోహిత్ శర్మ – 650 పరుగులు
* శ్రేయస్ అయ్యర్ – 496 పరుగులు
* శుభ్‌మన్ గిల్ – 490 పరుగులు
* కేఎల్ రాహుల్ – 367 పరుగులు
