virat kohli : సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(virat kohli), ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు ఆదివారం విశాఖలోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
Team India star cricketers virat kohli and Washington Sundar visits simhadri appanna
virat kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు ఆదివారం విశాఖలోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వీరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. అంకతముందు ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు.
కోహ్లీ (virat kohli ) రాకతో సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద సందడి నెలకొంది. తమ అభిమాన క్రికెటర్‌ను చేసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. కొందరు ఫ్యాన్స్‌తో కోహ్లీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rohit-Kohli : ఈ ఏడాది ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనిపించరు.. మళ్లీ వచ్చే ఏడాదే..
శనివారం విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అజేయ అర్థశతకంతో రాణించాడు. ఈ సిరీస్‌లో రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ సహా 302 పరుగులు చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక అయ్యాడు.
Rohit Sharma : కేక్ తినేందుకు నిరాకరించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక మాట చెప్పాడు చూడు..
కోహ్లీకి దైవ భక్తి ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లినా స్థానికంగా ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ ఉంటాడు.
