Vaibhav Sooryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీని భ‌య‌ప‌ట్టే బౌల‌ర్ ఎవ‌రో తెలుసా?

భార‌త్ క్రికెట్‌లో 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

Does Vaibhav Sooryavanshi Fear Any Bowler

Vaibhav Sooryavanshi : భార‌త్ క్రికెట్‌లో 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు అయిన సూర్య వంశీ ఐపీఎల్ 2025 ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు. ఐపీఎల్ 2026లో మ‌రింత అద్భుతంగా రాణించి ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేశాడు.

వైభ‌వ్ సూర్య‌వంశీ ప్ర‌త్యేక‌త అత‌డి అసాధార‌ణ‌మైన స్ట్రోక్ ప్లే. ఐపీఎల్‌లో కొంద‌రు అత్యుత్త‌మ అంత‌ర్జాతీయ బౌల‌ర్ల‌ను కూడా అత‌డు అల‌వోక‌గా ఎదుర్కొన్నాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లపై కూడా ధైర్యంగా భారీ షాట్లు ఆడుతూ తన ప్రతిభను చాటుకున్నాడు.

బుధవారం రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంది. ఈ వీడియోలో ఏ బౌల‌ర్‌ను ఎదుర్కొనేందుకు న‌వ్వు భ‌య‌ప‌డ‌తావు ? అని వైభ‌వ్ సూర్య‌వంశీకి ఓ ప్ర‌శ్న ఎదురైంది. ఇందుకు అత‌డు ‘ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ లేరు.’ అని బ‌దులు ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ సమాధానం అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Jasprit Bumrah : జ‌స్‌ప్రీత్‌ బుమ్రా గాయంపై మెక్‌గ్రాత్ కీల‌క వ్యాఖ్య‌లు..

వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా నియ‌మితులు అయ్యాడు. ఈ జట్టులో బీహార్ నుంచి ఎంపికైన ఏకైక ఆటగాడు సూర్యవంశీయే. ఈ జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, అంతర్జాతీయ ఆటగాళ్లు ముఖేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, మాజీ ఇండియా-ఏ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ కూడా ఉన్నారు.

దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరగనుంది.