US Open: ఫైనల్లో ఇద్దరు టీనేజర్లు.. ఎమ్మా రికార్డు.. ఆ ఒక్క పాయింట్‌‌తో లైఫ్ టర్న్!

యూఎస్ ఓపెన్‌లో బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఎమ్మా రెడుకాను చరిత్ర సృష్టించింది. గ్రాండ్ స్లామ్‌లో వుమెన్ సింగిల్స్ ఫైనల్లోకి చేరిన అత్యంత పిన్న వయస్సు ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది

Us Open 2021 British Qualifier Emma Raducanu (1)

Emma Raducanu Makes Tennis History : యూఎస్ ఓపెన్‌లో బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్, యువతేజం ఎమ్మారెడుకాను చరిత్ర సృష్టించింది. గ్రాండ్ స్లామ్‌లో వుమెన్ సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లిన అత్యంత పిన్న వయస్సు ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో బ్రిటీష్ టీన్ ఎమ్మా.. 17వ సీడెడ్ మారియా సకారినిని 6-1, 6-4 తేడాతో ఓడించింది. తద్వారా మారియా షరపోవా తర్వాత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఈ రికార్డు సాధించిన టీనేజర్‌గా ఎమ్మా రెడుకాను రికార్డు నెలకొంది. దాంతో 17ఏళ్లలో గ్రాండ్ స్లామ్ ఫైనలిస్టుకు చేరిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచింది. అయితే 17 ఏళ్ల వయసులో 2004 మారియా షరపోవా వింబుల్డన్‌ టైటిల్ సాధించింది.
Afghanistan Cricket: అఫ్ఘాన్ మహిళా క్రికెట్ జరగపోతే.. మెన్స్ జట్టుతో ఆడేది లేదు – క్రికెట్ ఆస్ట్రేలియా

వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో ఉన్న ఎమ్మా.. 18 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మరో టీనేజర్‌ 19 ఏళ్ల కెనడా ప్లేయర్‌ లేలా ఫెర్నాండెజ్‌తో ఎమ్మా తలపడనుంది. ఈ విషయాన్ని యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఆ ఒక్క పాయింట్‌ ఎమ్మా రెడుకాను లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటూ విషెస్ తెలిపింది. ఎమ్మా.. మీరూ యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో ఉన్నారు తెలుసా‘ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.


సెమీ ఫైనల్లో అద్బుత విజయం తర్వాత ఎమ్మా స్పందిస్తూ.. ‘నేను ఫైనల్‌ చేరుకున్నాను. నిజంగానే నేనిది నమ్మలేకపోతున్నాను. నేను ఇప్పుడు టెక్నికల్‌గా ఫైనల్‌లో ఉన్నాను. చాలా షాకింగ్‌ అనిపిస్తోంది. మరి సంతోషంగా ఉంది’ అంటూ ఎమ్మా భావోద్వేగానికి లోనైంది.

1999 తర్వాత యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు టీనేజర్లు ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం. గతంలో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్‌, 18 ఏళ్ల మార్టినా హింగిస్‌ను ఓడించి టైటిల్‌ సొంతం చేసుకుంది. శనివారం రోజున ఎమ్మా, లేలా మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.
Afghan crisis : తాలిబన్ టెర్రర్..అజ్ఞాతంలోకి అఫ్ఘానిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు..