Afghan crisis : తాలిబన్ టెర్రర్..అజ్ఞాతంలోకి అఫ్ఘానిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు..

అఫ్గానిస్థాన్ ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక..మహిళా క్రీడాకారులు పరిస్థితి దారుణంగా మారింది.కాలు బయటపెడితేచంపేస్తామని బెదిరింపులతో మహిళా క్రికెటర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Afghan crisis : తాలిబన్ టెర్రర్..అజ్ఞాతంలోకి అఫ్ఘానిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు..

Afghan Women Cricketers Went Underground

Afghan crisis..women cricketers went underground : అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక..ఎన్నో అరాచాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను మనుషులుగానే చూడటంలేదు. లైంగిక వాంఛలు తీర్చే యంత్రాలుగా చూస్తున్నారు. 20ఏళ్లుగా అధికారానికి దూరమైన తాలిబన్లు మళ్లీ అరాచకాలకు నాందిపలికారు.దీంతో అఫ్గాన్ లో మహిళ బ్రతుకులు అత్యంత దుర్భరంగా మారిపోయాయి.ఆశ అనేదే లేకుండా జీవఛ్ఛవాలుగా జీవిస్తున్నారు మహిళలు. ఈ క్రమంలో ఎంతోమంది దేశ వదిలిపోయారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు దేశం వదిలిపోయారు. వెళ్లలేనివారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు అఫ్గాన్ ఆఫ్ఘనిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు సభ్యుల పరిస్థితి అలాగే ఉంది. క్రీడల పట్ల తాలిబన్ల విముఖత చూపించటం ముఖ్యంగా మహిళా క్రీడాకారులంటే చులకన భావంతో వారిపై ఆంక్షలు విధిస్తున్నారు. మహిళా క్రీడాకారులు ఎక్కడున్నారో లిస్టు తయారు చేసి మరీ హెచ్చరిస్తున్నారు. ఇక మీ ‘ఆట’లు చెల్లవ్ అని హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో ఆఫ్ఘనిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది.

అనేకమంది ఆఫ్ఘన్ క్రీడాకారులు ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోగా..తాజాగా ఆఫ్ఘన్ మహిళా క్రికెట్ జట్టు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.వీరితో పాటు మహిళా ఫుడ్ బాల్ క్రీడాకారిణులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాలిబన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ను వశపరుచుకున్నప్పటి నుంచి మహిళా క్రికెటర్ల కోసం గాలిస్తున్నారు. బయటికి అడుగు పెడితే కాల్చివేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ దారుణ దుస్థితిపై ఓ ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాబూల్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని..మహిళా క్రికెటర్లే కాకుండా ఇతర క్రీడలకు సంబంధించిన మహిళల ప్రాణాలకే ప్రమాదంగా ఉందని..వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్లు కాబూల్ లో ప్రవేశించినప్పటి నుంచి తాను తన క్రికెట్ కిట్ దాచిపెట్టేశానని దాదాపు అందరి పరిస్థితి అలాగే ఉందని వాపోయింది.

తాలిబన్లు ఇప్పటికే మహిళా క్రీడాకారిణుల గురించి వెతికి వెతికి మరీ బెదిరించారని..ఆటలు పాటలు అంటూ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే కాల్చిపారేస్తం జాగ్రత్త..మరోసారి క్రికెట్ ఆడితే ప్రాణాలు తీసేస్తామని హెచ్చరించారని ఆ మహిళా క్రికెటర్ తీవ్ర ఆవేదనతో తెలిపింది. తమకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని..ప్రతి రోజు రాత్రివేళల్లో తమ పరిస్థితి గురించి గ్రూపులో మాట్లాడుకుంటామని తనలాగే అందరి పరిస్థితి ఉందని వివరించింది. తమ పరిస్థితి గురించి ఐసీసీకి విన్నవించుకున్నా ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిందామె.తమ పరిస్థితిని వివరిస్తూ..ఇమెయిల్ పంపినా.. ప్రపంచ క్రికెట్ పాలకమండలి నుండి ఎటువంటి స్పందన రాలేదని తెలిపింది.

మేంతా నిస్సహాయ స్థితిలో ఉన్నాం..వీలైనంత వరకూ మహిళా క్రీడాకారులు దేశం వదిలిపోతున్నారని తెలిపింది. మా తోటి మహిళా క్రికెటర్ దేశం వదిలిపోయిందని..అలా వెళ్లే క్రమంలో ఆమె ఎంతగా భయపడిపోయిందో..ఒక్కో ఇంట్లో దాక్కుంటు..తన ఆచూకీ తెలిస్తే ఎక్కడ చంపేస్తారోననే భయంతో అల్లాడిపోయిందని తెలిపింది. తాలిబన్లకు చిక్కకుండా

ఉండటానికి ఎన్నో ఇళ్లు మారిన ఆ క్రికెటర్..చివరికి ఎలాగోలా దేశాన్ని విడిచిపోయిందని తెలిపింది.

ఇది కేవలం మహిళా క్రికెటర్ల పరిస్థితే కాదు..ఆఫ్ఘన్ లో మహిళా ఫుట్ బాల్ జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉందని..చాలామంది క్రీడాకారిణిలు ఇప్పటికే దేశ వదిలి యూరప్ దేశాలకు వెళ్లిపోయారని తెలిపిందా మహిళా క్రికెటర్. ఈవిషయం తెలిస్తే నన్ను మా కుటుంబాన్ని కూడా చంపేస్తారని భయం భయంగా తెలిపింది.