Yashasvi Jaiswal : బ్యాడ్ ల‌క్ అంటే య‌శ‌స్వి జైస్వాల్‌ దే.. భారీ రికార్డును మిస్..

య‌శ‌స్వి జైస్వాల్ ఓ భారీ రికార్డును త‌న పేరిట లిఖించుకునే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు.

ENG vs IND 2nd test Yashasvi Jaiswal just miss the huge record

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్‌ య‌శ‌స్వి జైస్వాల్ ఓ భారీ రికార్డును త‌న పేరిట లిఖించుకునే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. టెస్టుల్లో ఇన్నింగ్స్‌ల ప‌రంగా అత్యంత వేగంగా 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న భార‌త ఆట‌గాడిగా నిలిచే సువ‌ర్ణావ‌కాశాన్ని చేజార్చుకున్నాడు.

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా బుధ‌వారం ఇంగ్లాండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 107 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో 87 ప‌రుగులు సాధించాడు. బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెలుతున్న బంతిని వెంటాడి మ‌రీ వికెట్ కీప‌ర్ జేమీ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

Yashasvi Jaiswal : 51 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన య‌శ‌స్వి జైస్వాల్‌.. బ‌ర్మింగ్‌హామ్‌లో ఒకే ఒక టీమ్ఇండియా ఆట‌గాడు

ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ మ‌రో 10 ప‌రుగులు సాధించి ఉంటే.. రాహుల్ ద్ర‌విడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ల‌ను అధిగ‌మించి టెస్టుల్లో అత్యంత వేగంగా 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించేవాడు. కానీ దుర‌దృష్ట వ‌శాత్తు ఈ భారీ రికార్డుకు 10 ప‌రుగుల దూరంలో నిలిచిపోయాడు.

రాహుల్ ద్ర‌విడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఇద్ద‌రూ కూడా 40 ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నారు. తాజా ఇన్నింగ్స్‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు జైస్వాల్ 39 ఇన్నింగ్స్‌ల్లో 1990 ప‌రుగులు సాధించాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ మ‌రో 10 ప‌రుగులు సాధిస్తే ద్ర‌విడ్‌, సెహ్వాగ్‌ల స‌ర‌స‌న చేరుతాడు.

Shubman Gill : చ‌రిత్ర సృష్టించిన శుభ్‌మ‌న్ గిల్‌.. ఆసియా ప్లేయ‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

టెస్టుల్లో అత్యంత వేగంగా 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న భార‌త ఆట‌గాళ్లు వీరే..

రాహుల్ ద్ర‌విడ్ – 40 ఇన్నింగ్స్‌ల్లో
వీరేంద్ర సెహ్వాగ్ – 40 ఇన్నింగ్స్‌ల్లో
విజయ్ హజారే – 43 ఇన్నింగ్స్‌ల్లో
గౌత‌మ్ గంభీర్ – 43 ఇన్నింగ్స్‌ల్లో
సునీల్ గ‌వాస్క‌ర్ – 44 ఇన్నింగ్స్‌ల్లో