Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఆసియా ప్లేయర్లలో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు.

Shubman Gill Becomes First Asian Player To Complete this Stunning Feat
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా రెండు సెంచరీలు చేసిన అత్యంత పిన్న వయస్కుడైన (25 సంవత్సరాల 297 రోజులు) ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి ఈ ఘనత అందుకున్నాడు.
శుభ్‌మన్ గిల్ కన్నా ముందు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్రేమ్ స్మిత్ పర్యాటక జట్టు కెప్టెన్‌గా 22 ఏళ్ల 180 రోజుల వయసులో ఇంగ్లాండ్ గడ్డపై రెండు శతకాలు బాదాడు. 2003 ఇంగ్లాండ్ పర్యటనలో స్మిత్ ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో జావెద్ బుర్కీ (పాకిస్థాన్), బిల్లీ (ఆస్ట్రేలియా) ఒక్కో సెంచరీ చేశారు.
ఇంగ్లాండ్ గడ్డపై 25 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులో సెంచరీలు చేసిన పర్యాటక కెప్టెన్లు వీరే..
గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) – 2 సెంచరీలు
శుభ్‌మన్ గిల్ (భారత్) – 2 శతకాలు
జావేద్ బుర్కి (పాకిస్థాన్) – 1 సెంచరీ
బిల్లీ ముర్డోక్ (ఆస్ట్రేలియా) – 1 సెంచరీ
ఇంగ్లాండ్ సిరీస్‌తోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు శుభ్‌మన్ గిల్. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేశాడు. ఇక ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 114 పరుగులతో అజేయంగా ఉన్నాడు.
ఇక ఇంగ్లాండ్ గడ్డ పై ఒకటి కంటే ఎక్కువ శతకాలు చేసిన మూడో భారత కెప్టెన్‌గా గిల్ రికార్డులకు ఎక్కాడు. అతడి కంటే ముందు మహమ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీలు చెరో రెండు శతకాలు బాదారు.
IND vs ENG: యశస్వీ జైస్వాల్, బెన్ స్టోక్స్ మధ్య వాగ్వాదం.. తనదైన స్టైల్‌లో బదులిచ్చిన యువ బ్యాటర్.. కానీ, చివర్లో బ్యాడ్‌లక్.. వీడియోలు వైరల్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (114 ), రవీంద్ర జడేజా (41) క్రీజులో ఉన్నారు. మిగిలిన వారిలో యశస్వి జైస్వాల్ (87; 107 బంతుల్లో 13 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25) లు పర్వాలేదనిపించగా, కేఎల్ రాహుల్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (1) లు విఫల అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌వోక్స్ రెండు వికెట్లు తీశాడు. బెన్‌స్టోక్స్, షోయబ్ బషర్ చెరో వికెట్ పడగొట్టారు.