Ind vs Eng: అయ్యో.. ఎంత పనిచేశావ్ నితీశ్.. బ్యాట్ అడ్డుపెట్టినా సరిపోయేది కదా.. వీడియో వైరల్.. ఫ్యాన్స్ ఫైర్
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.

Nitish Kumar Reddy
Ind vs Eng: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత భారత్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా తొలిరోజు బ్యాటింగ్ చేసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (114 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (41 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
నితీశ్ బ్యాడ్‌లక్..
తొలిరోజు మ్యాచ్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (87) అద్భుత బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25)లు తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. హైదరాబాద్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో పాతుకుపోయి భారత్ జట్టు స్కోర్ ను పరుగులు పెట్టిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ, కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నితీశ్ క్రికెట్ అభిమానులను నిరాశపర్చాడు. బంతి వికెట్ల పక్కనుంచి వెళ్తుందని భావించి నితీశ్.. బ్యాట్ పైకి ఎత్తడంతో ఊహించని విధంగా బాల్ టర్న్ అయ్యి వికెట్లను తాకింది. దీంతో నితీశ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బ్యాట్ అడ్డుపెట్టినా సరిపోయేది..
తొలి టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కలేదు. దీంతో అతన్ని ఆడించకపోవటంపై సోషల్ మీడియాలో గంభీర్ పై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దీంతో రెండో టెస్టులో నితీశ్ రెడ్డికి అవకాశం కల్పించారు. అతను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడతాడని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ, అందరినీ నిరాశపరుస్తూ నితీశ్ రెడ్డి కేవలం ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు.
Chris Woakes cleans up Nitish Kumar Reddy. pic.twitter.com/z7TiYOQXkN
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 2, 2025
ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ ఇన్ స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన నితీశ్ రెడ్డి.. ఆడకుండా బ్యాట్‌ను పైకెత్తి బంతిని వదిలేశాడు. ఆ బంతి కాస్త ఇన్‌స్వింగ్ అయ్యి నేరుగా వికెట్లను తాకింది. నితీశ్ అవుట్ అయిన విధానం చూసి క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కనీసం బ్యాట్ అడ్డుపెట్టినా సరిపోయేది కదా.. ఎంత పనిచేశావ్ నితీశ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.