IND vs ENG: యశస్వీ జైస్వాల్, బెన్ స్టోక్స్ మధ్య వాగ్వాదం.. తనదైన స్టైల్‌లో బదులిచ్చిన యువ బ్యాటర్.. కానీ, చివర్లో బ్యాడ్‌లక్.. వీడియోలు వైరల్
రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ..

Yashasvi jaiswal vs Ben Stokes
IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తొలిరోజు ఆట పూర్తయ్యే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (144 నాటౌట్) అద్భుత బ్యాటింగ్ చేశాడు. మరోవైపు యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సైతం అదరగొట్టాడు. 13ఫోర్లతో 87పరుగులు చేశాడు.
డిష్యూం డిష్యూం..
తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్ కు దిగాడు. అయితే, జైస్వాల్ తనదైన రీతిలో బెన్ స్టోక్ కు బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Some heated JAISBALL 🆚 BAZBALL on display! 👀#ENGvIND 👉 2nd Test, Day 1 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/g6BryBoy3Y pic.twitter.com/ZJWy1ir2ih
— Star Sports (@StarSportsIndia) July 2, 2025
అసలేం జరిగింది..?
తొలుత భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా.. ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్ క్రీజులోకి వచ్చాడు. దూకుడుగా ఆడుతూ వరుస బౌండరీలతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించాడు. అయితే, 19వ ఓవర్ నాల్గో బంతిని స్టోక్స్ ఔట్ సైడ్ ఆఫ్‌స్టంప్ లైన్‌లో వేయగా జైస్వాల్ బ్యాక్‌ఫుట్ షాట్‌తో బౌండరీకి తరలించాడు. అయితే, ఆ తరువాతి బంతిని స్టంప్స్ పైకి వేయగా జైస్వాల్ వేగంగా సింగిల్ తీశాడు. ఈ క్రమంలో స్టోక్స్ పక్కనుంచే జైస్వాల్ పరుగెత్తాడు. స్టోక్ ఏదో అన్నాడు. దీంతో జైస్వాల్ ‘నా మాటలు వినాలని నీకు లేదు.. కమాన్’ అని బదులిచ్చాడు. ఆ వెంటనే స్టోక్స్ ‘అసలు నువ్వు ఏం వద్దంటున్నావ్.?’ అంటూ ప్రశ్నించాడు. 19వ ఓవర్లో చివరి బంతిని స్టోక్స్ స్టంప్ పైకి వేయగా.. కరుణ్ నాయర్ డిఫెండ్ చేశాడు. ఈసారి జైస్వాల్ వైపు నడిచిన స్టోక్స్ ‘నువ్వు ఏం అన్నావ్’ అని అడిగాడు. అయితే, జైస్వాల్ స్పందించలేదు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.
The emotions by Ben Stokes after getting Jaiswal. pic.twitter.com/r9nvKzcLya
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 2, 2025
జైస్వాల్ బ్యాడ్‌లక్ ..
జైస్వాల్ అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. అయితే, స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ వికెట్ చేజేతులా సమర్పించుకున్నదే. శతకం సాధించేలా కనిపించిన జైస్వాల్.. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. దీంతో సెంచరీని మిస్ చేసుకోవడంతోపాటు.. ఓ భారీ రికార్డును మిస్ చేసుకున్నాడు. జైస్వాల్ మరో 10 పరుగులు చేసిఉంటే అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచేవాడు. అంతేకాక.. రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించిన ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. కానీ, దురదృష్టం 10 పరుగుల దూరంలో ఆ రికార్డును జైస్వాల్ మిస్ చేసుకున్నాడు.
రాహుల్ ద్రవిడ్, సెహ్వాగ్ 40 ఇన్నింగ్స్‌లలో 2వేల పరుగుల మైలురాయి అందుకున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఔటైన తరువాత జైస్వాల్ 1990 పరుగులతో (39 ఇన్నింగ్స్ లు) ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 10 పరుగులు చేస్తే ద్రవిడ్, సెహ్వాగ్ సరసన నిలుస్తాడు.