Yashasvi Jaiswal : 51 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్.. బర్మింగ్‌హామ్‌లో ఒకే ఒక టీమ్ఇండియా ఆటగాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.

ENG vs IND 2nd test Yashasvi Jaiswal breaks 51 year old record with 87 in Birmingham Test
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డులకు ఎక్కాడు. బుధవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో 51 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు సుదీర్ నాయక్ పేరిట ఉండేది. 1974లో సుదీర్ నాయక్ 77 పరుగులు సాధించాడు.
బర్మింగ్‌హామ్ టెస్ట్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్లు..
యశస్వి జైస్వాల్ – 87 పరుగులు (2025లో)
సుధీర్ నాయక్ – 77 పరుగులు (1974లో)
సునీల్ గవాస్కర్ – 68 పరుగులు (1979లో)
ఛతేశ్వర్ పుజరా – 66 పరుగులు (2022లో)
సునీల్ గవాస్కర్ – 61 పరుగులు (1979లో)
Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఆసియా ప్లేయర్లలో ఒకే ఒక్కడు..
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్..
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ మరో అరుదైన ఘనత సాధించాడు. సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అతడికి ఇది ఐదో అర్థశతకం. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. సెనా దేశాల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ నాలుగు అర్థశతకాలు మాత్రమే చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (114 ), రవీంద్ర జడేజా (41) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌వోక్స్ రెండు వికెట్లు తీశాడు. బెన్‌స్టోక్స్, షోయబ్ బషర్ చెరో వికెట్ పడగొట్టారు.