IND vs ENG : బాబోయ్.. రాకాసి బౌన్సర్.. నితీశ్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. వెంటనే కింద పడిపోయాడు.. వీడియో వైరల్

మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతున విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు.

Nitheesh Reddy

IND vs ENG 3rd Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కాగా.. భారత్ జట్టు కూడా 387 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. అయితే, మూడో రోజు ఆటలో టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.

Also Read: ఓరి వీళ్ల వేషాలో.. చివరి ఓవర్లో పెద్ద డ్రామా ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు.. శుభ్‌మన్‌ గిల్‌కు చిర్రెత్తుకొచ్చి ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్

మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌన్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఓ రాకాసి బౌన్సర్ వేగంగా వచ్చి నితీశ్ కుమార్ రెడ్డి దవడ భాగంలో బలంగా హెల్మెంట్‌ను తాకింది. దీంతో అతను కింద పడిపోయాడు. బెన్ స్టోక్స్ వేసిన 90వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ ఓవర్లో రెండో బంతిని బెన్ స్టోక్స్ గంటకు 141 కిలోమీటర్ల వేగంతో వేయగా.. అనూహ్యంగా బౌన్స్ అయిన బంతి నితీశ్ కుమార్ హెల్మెంట్‌కు దవడ భాగంలో బలంగా తాకింది. నితీశ్ వెంటనే కిందపడి పోవడంతో ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. దవడ భాగంలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఐస్ ప్యాక్ తెప్పించాడు. హెల్మెంట్‌ను పరిశీలించి వెంటనే కొత్తది తెప్పించి పెట్టుకున్నాడు. హెల్మెంట్ గ్రిల్ లేకపోతే నితీశ్ రెడ్డికి పెద్ద దెబ్బే తగిలేది. స్వల్ప గాయం కావడంతో నితీశ్ రెడ్డి తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


నితీశ్ కుమార్ రెడ్డి (31) చివరి సెషన్ ఆరంభంలో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. అది కూడా బౌన్సర్ కావడం గమనార్హం. వేగంగా వచ్చిన బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ బంతి నితీశ్ బ్యాటును తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నితీశ్ పెవిలియన్ బాటపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇదిలాఉంటే.. నాల్గోరోజు ఆటలో (ఆదివారం) ఇంగ్లాండ్‌ను ఎంత త్వరగా భారత్ ఆలౌట్ చేస్తుందన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.