ENG vs IND 3rd Test James Anderson wants Jofra Archer will play Lord match
లండన్‌లోని లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్.. రెండో టెస్టులో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో అచ్చొచ్చిన లార్డ్స్ స్టేడియంలో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. మూడో టెస్టు ముందు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జేమ్స్ అండర్సన్ ఆ జట్టుకు ఓ కీలక సూచన చేశాడు.
మూడో టెస్టు మ్యాచ్‌లో పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతడిని ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్‌లో ఆడించకుంటే అది పొరపాటే అవుతుందని చెప్పుకొచ్చాడు.
Prithvi Shaw : ఇక నా లైఫ్ మారుతుంది.. పృథ్వీ షా హాట్ కామెంట్స్.. ముంబైను వీడి మహారాష్ట్రను చేరి..
కాగా.. 2021 ఫిబ్రవరిలో జోఫ్రా ఆర్చర్ గాయపడ్డాడు. అప్పటి నుంచి ఇంత వరకు అతడు టెస్టు మ్యాచ్ ఆడలేదు. కాగా.. ఇటీవల ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. భారత్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో భాగమైనప్పటికి అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు.
ఆర్చర్‌ను మూడో టెస్టులో ఆడించే విషయమై ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకనే అతడికి మూడో టెస్టు తుది జట్టులో ఎంపిక కోసం పరిగణలోకి తీసుకుంటామన్నాడు. అతడు ఎలాంటి ప్రభావం చూపగలడో తమకు తెలుసునని అన్నాడు.
లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండో టెస్టులో విఫలమైన బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్ స్థానాల్లో ఆర్చర్, గస్ అట్కిన్సన్‌లకు ఇంగ్లాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
భారత్‌తో మూడో టెస్ట్‌కు ఇంగ్లాండ్ స్క్వాడ్ ఇదే..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.