Prithvi Shaw : ఇక నా లైఫ్ మారుతుంది.. పృథ్వీ షా హాట్ కామెంట్స్.. ముంబైను వీడి మహారాష్ట్రను చేరి..
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో రాబోయే సీజన్ 2025-26 నుంచి మహారాష్ట్ర తరుపున ఆడనున్నాడు.

Prithvi Shaw will will represent Maharashtra Cricket Association from upcoming domestic season
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో రాబోయే సీజన్ 2025-26 నుంచి మహారాష్ట్ర తరుపున ఆడనున్నాడు. ఇన్నాళ్లు అతడు ముంబైకి ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే.. ఫిట్ నెస్, క్రమశిక్షణారాహిత్యం కారణంగా గత సీజన్‌లో ముంబై రంజీ జట్టులో అతడు స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో అతడు వేరే జట్టుకు ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇదే విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలిపి, నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇక ఎంసీఏ కూడా అతడికి ఎన్ఓసీని ఇచ్చింది. దీంతో అతడు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. ఇక పై అతడు మహారాష్ట్ర తరుపున ఆడనున్నాడు.
PRITHVI SHAW JOINS MAHARASHTRA…!!!!
– Waiting for Ruturaj × Shaw opening. 💛 pic.twitter.com/UPT4qF9mYv
— Johns. (@CricCrazyJohns) July 7, 2025
తన కెరీర్‌లోని ఈ దశలో మహారాష్ట్ర జట్టులో చేరడం వల్ల క్రికెటర్‌గా మరింత ఎదగగలనని నమ్ముతున్నానని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లు తనకు మద్దతు ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక పృథ్వీ షా మహారాష్ట్రలో చేరడం పట్ల మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహిత్ పవార్ స్పందించాడు. అతడి చేరిక తమ జట్టుకు గొప్ప బలాన్ని చేకూరుస్తుందని చెప్పాడు. యువ ఆటగాళ్లకు అతడి అంతర్జాతీయ, ఐపీఎల్ అనుభవం ఎంతో విలువైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.
ENG vs IND : భారత భరతం పట్టాలని నిర్ణయించుకున్న ఇంగ్లాండ్.. కెప్టెన్, కోచ్ ఒకే మాట..!
టీమ్ఇండియా తరుపున పృథ్వీ షా.. 5 టెస్టులు, ఆరు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 339, వన్డేల్లో 49 పరుగులు చేశాడు. ఆడిన ఒక్క టీ20 మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడాడు. 23.9 సగటుతో 1892 పరుగులు చేశాడు. కాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.